నారాయణపేట: జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల ఉచిత శిక్షణ ఎంపిక ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాకేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ వినీత్ తనిఖీ చేశారు. మొత్తం 579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 413 మంది పరీక్షకు హాజరయ్యారు. పోలీస్ బందోబస్తు మధ్య పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. త్వరలోనే ఫలితాలను వెల్లడించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులకు టౌన్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు రవికుమార్‌గౌడ్ బృందం సహకారంతో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్‌హక్, డీఎస్పీలు మహేష్, నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్, రాంలాల్, భగవంత్‌రెడ్డి, సైదులు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


