నారాయణపేట: ప్రజావాణి ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 19 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా శాఖల వారీగా ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఫిర్యాదుదారులకు సంతృప్తికర పరిష్కారం అందేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


