రేషన్‌ దందా! | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ దందా!

Oct 6 2026 1:00 AM | Updated on Oct 6 2026 1:00 AM

చర్యలు తీసుకుంటాం..

తనిఖీలు కొనసాగుతున్నా..

రూటు మారిన..

రేషన్‌ బియ్యంలోని నూక లు వేరుచేసి పాలిషింగ్‌ చేసి వివిధ బ్రాండ్ల పేరిట బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. మిల్లులపై దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టి రేషన్‌ బియ్యమని తెలితే కఠిన చర్యలు తీసుకుంటాం. కిరాణ వ్యాపారులు ఇతర జిల్లాల మిల్లుల నుంచి రేషన్‌ బియ్యంతో పోలిన సన్నబియ్యం దిగుమతి చేసుకొని విక్రయించాలని చూసినా వారిపై కూడా చర్యలు తీసుకుంటాం.

– బాలరాజు,

డీఎస్‌ఓ, నారాయణపేట

మరికల్‌: అక్రమార్కులు ఇన్నాళ్లు రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి రీ సైక్లింగ్‌ చేసేవారు. ప్రస్తుతం రూటు మార్చి రేషన్‌ బియ్యంలో నూకలు వేరుచేసి పాలిష్‌ చేసి వివిధ బ్రాండ్ల పేరిట బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న వరికి మద్దతు ధరతో పాటు క్వింటాకు అదనంగా రూ.500 బోనస్‌ చెల్లిస్తుండటంతో రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. దీంతో బహిరంగ మార్కెట్‌లో సన్న ధాన్యం కొరత నెలకొని బియ్యం ధరలు అడ్డగోలుగా పెరిగాయి. దీన్ని ఆసరగా చేసుకొని మిల్లర్లు తమ పంథా మార్చి రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి వివిధ రకాల బ్రాండ్ల పేరిట బహిరంగ మార్కెట్‌లో బియ్యం విక్రయిస్తున్నారు. దీంతో రేషన్‌ లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన సన్నరకం బియ్యాన్ని తక్కువ ధరకు విక్రయిస్తూ అవే బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేస్తూ నష్టపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

చుక్కల్లో బియ్యం ధరలు..

గతంలో సన్నబియ్యం మార్కెట్‌లో కిలో రూ.30 నుంచి రూ.40 వరకు ఉండేది. ప్రస్తుతం వాటి ధర అమాంతం పెరిగింది. బీపీటీ కిలో రూ.52, జైశ్రీరాం రూ.67, హెచ్‌ఎంటీ రూ.64, ఆర్‌ఎన్‌ఆర్‌ రూ.62కు విక్రయిస్తున్నారు.

బహిరంగ మార్కెట్‌లో 25 కిలోల సంచులుగా లభ్యం?

ఇతర జిల్లాల నుంచి సరఫరా

సంచి మార్చి..

కొనుగోలుదారులను ఏమార్చి...

చుక్కలనంటుతున్న ధరలు

పేదలకు సన్న బియ్యం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాని చాలామంది వీటిని తినకుండా విక్రయిస్తుండటంతో అక్రమార్కుల దందా సులువవుతోంది. అధికారులు, పోలీసులు తనిఖీలు చేపడుతూ కేసులు నమోదు చేస్తున్నా అక్రమాలు ఆగడం లేదు. కొత్త తరహా దందాకు తెర లేపారు. రేషన్‌ లబ్ధిదారుల నుంచి కిలో బియ్యం రూ.16 నుంచి రూ.18 వరకు కొనుగోలు చేసి బడా వ్యాపారులకు రూ.20 నుంచి రూ.25 వరకు విక్రయిస్తున్నారు. వారు ఇతర రాష్ట్రాలకు తరలించి రూ.30 నుంచి రూ.35 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు మిల్లర్లతో మిలాకత్‌ అయి రూ.30 నుంచి రూ.33 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కొందరు మిల్లర్లు, బడా వ్యాపారులు దళారుల నుంచి రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో విక్రయించడం, సీఎంఆర్‌ కింద తిరిగి ప్రభుత్వానికి అందించి లబ్ధిపొందుతున్నట్లు సమాచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement