నారాయణపేట ఎడ్యుకేషన్: ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఏం కొనాలో.. ఏం తినాలో అని ఆలోచిస్తున్నారు. రూ.వందలు వెచ్చించినా సంచి నిండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి ప్రభావంతో జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గి ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడమే ప్రధాన కారణంగా వ్యాపారులు చెబుతున్నారు.
● నారాయణపేట మార్కెట్‌లో ఏ కూరగాయ కొన్నా కిలో సుమారు రూ.50 చెల్లించాల్సిందే. ఆ లు, బెండ, వంకాయ, సొరకాయ మినహా మిగ తా అన్ని కూరగాయలు కిలోకు 50కి పైనే ఉన్నా యి. మరి ముఖ్యంగా బీర్నీస్ కిలోకు రూ.120, మునగ రూ.100, బీరకాయ, పర్చిమిర్చి, చిక్కుడు రూ.80 పలుకుతుండటంతో వాటిని కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు.
రవాణా ఖర్చులు..
కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి తరలించేందుకు రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. డీజిల్, లోడింగ్, కార్మికుల వ్యయాలు పెరగడంతో వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతు న్నారు. ఉదయం మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేసిన సరుకులు జిల్లాకు తీసుకొచ్చే సరికి మరింత ధర పెంచక తప్పడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. మధ్యవర్తుల ప్రభా వం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన కూరగాయలు వినియోగదారుడికి చేరేసరికి మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగి అమ్ముడవుతున్నాయి.
చుక్కలు చూస్తున్న వినియోగదారులు..
రోజువారీ కూలీలు, చిరు ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నారు. గతంలో రూ.100తో రెండు, మూడు రోజుల కూరగాయల వచ్చేవి. ఇప్పుడు ఒక్కరోజుకే రూ.200 వరకు ఖర్చవుతోంది. టమాటా, మిర్చి లేకుండా వంట చేయలేం. కానీ ధరలు చూస్తే కొనలేని పరిస్థితి అని గృహిణులు వాపోతున్నారు. కొంతమంది వినియోగదారులు తక్కువ పరిమాణంలోనే కొనుగోలు చేస్తుండగా, మరికొందరు ధరలు తక్కువగా ఉన్న కూరగాయల వైపు మొగ్గు చూపుతున్నారు.
నారాయణపేట మార్కెట్లో
కూరగాయాల ధరలు.. (కిలో రూ.లలో..)
బీర్నీస్ 120, బీరకాయ 80 ,మునగ 100,
క్యాప్సి కమ్ 80,చిక్కుడు 80, కాకరకాయ 80, మిర్చి 80, బీట్‌రూట్60, క్యారెట్ 60,
టమాట 50, గోరు చిక్కుడు 50, బెండకాయ 40,
వంకాయ 40, ఆలుగడ్డ 30, సొరకాయ 40.
కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో మా లాంటి మధ్యతరగతి కు టుంబాలు కొనలేని పరిస్థి తి నెలకొంది. ఎండా కాలం కావడంతో పొలంలో నీరు లేక ఎలాంటి పంటలు పండించకుండా మార్కెట్‌లోని కూరగాయలపైనే ఆధారపడుతున్నాం. కావున ధరలు నియంత్రణలోకి రావాలి. అదేవిధంగా గ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించి భారం పడకుండా చూడాలి.
– సావిత్రి, గృహిణి, బైరంకొండ
పెరిగిన కూరగాయల ధరలు
బీర్నీస్, క్యాప్సికం
కిలో రూ.120కి పైనే..
వేసవి దెబ్బకు తగ్గిన సాగు..
ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి
ఇబ్బందుల్లో సామాన్య ప్రజలు


