సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

Jun 1 2026 12:50 AM | Updated on Jun 1 2026 12:50 AM

భూత్పూర్‌/ కొల్లాపూర్‌ రూరల్‌: ఉమ్మడి పాలమూ రు జిల్లాలో 4, 5 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ రిజర్వాయర్‌ను కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ సందర్శించి.. హెలిప్యాడ్‌ స్థలాన్ని పరిశీలించారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిశీలనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి నార్లాపూర్‌ రిజర్వాయర్‌ను సందర్శించనున్నారని.. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధి కారులను వారు ఆదేశించారు. అనంతరం సోమశిలలో హెలిప్యాడ్‌ స్థలంతో పాటు కృష్ణా ఘాట్లను పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భద్రతాపరమైన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. వారి వెంట జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, ఆర్డీఓ బన్సీలాల్‌, తహసీల్దార్‌ మాధవి, ఇరిగేషన్‌ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌ ఉన్నారు.

● భూత్పూర్‌ మండలం కర్వెన ప్రాజెక్టును 5న సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా నీటిపారుదలశాఖ సీఈ సత్యనారాయణరెడ్డితో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి హెలీప్యాడ్‌ కోసం అనువైన స్థలాన్ని పరిశీలించారు. వారి వెంట ఇరిగేషన్‌ అధికారి విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌ సుశీల రెడ్యానాయక్‌, నరేందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement