సర్వీస్ బుక్‌ల డిజిటలైజేషన్‌కు సంబంధించి ఆన్‌లైన్ చేసేందుకు మరింత సమయం ఇవ్వాలి. సెలవులు కావడంతో కొంతమంది టూర్‌లకు వెళ్లడం, ఇతర పనులు, ఆరోగ్యం సమస్యలు ఉన్నవారు ఉన్నారు. వెంటనే ఆన్‌లైన్ చేయడం వల్ల తప్పులు దొర్లితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పంచింది ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించడంతోపాటు సర్వీస్ బుక్‌ల ఆన్‌లైన్ నమోదులో ఇబ్బందులు లేకుండా చూడాలి.
– మదన్‌మోహన్‌యాదవ్,
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు
గడువు పొడిగించాలి..
ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీస్ బుక్కులను ఆన్‌లైన్ చేయడం మంచి నిర్ణయమే. ఇలా చేయ డం వల్ల భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు లే కుండా ఉంటాయి. కానీ, వీటిని ఆన్‌లైన్ చేసేందుకు కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఇచ్చి ప్రక్రియ పూర్తి చేయాలి అని చెప్పడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది బడిబాట, కొంత మంది జనగనణలో ఉన్నారు. అలాంటి వారికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం గడువు తేదీని పొడిగించాలి.
– శ్యాంబాబు, టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు
●


