ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారమే ఈ ఏడాది కళాశాలలకు అనుమతులు ఇస్తున్నాం. జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు అందిన వాటిలో అడిషనల్ సెక్షన్ విషయంలోనే పెండింగ్ ఉన్నాయి. ఏ ఒక్క కళాశాలకు అనుమతి రాలేదు. ఉన్నతాధికారులకు విన్నవించాం. నిర్ణయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అనుమతి వచ్చిన తర్వాత ప్రవేశాలు చేసుకోవాలి.
– సుదర్శన్‌రావు, డీఐఈఓ, నారాయణపేట
ప్రభుత్వ కళాశాలల్లో చేరాలి..
ప్రైవేట్‌కు దీటుగా కొనసాగుతున్న ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు చేరేందుకు ఆలోచించా లి. అనుమతి ఉందా.. లేదా అనే సందేహాలు ప్ర భుత్వ కళాశాలలకు ఉండవు. ప్రైవేట్, కార్పొరేట్‌కు దీటుగానే స్టడీ అవర్స్, స్లిప్ టెస్టుల నిర్వహ ణ, సిలబస్ పూర్తి చేసి పరీక్షల్లో సైతం చక్కటి ఫ లితాలు సాధిస్తున్నాం. ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు ఈ ఏడాది నుంచి మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. తప్పుడు నిర్ణయాలతో భవిష్యత్ నాశనం చేసుకోకుండా జాగ్రత్త పడాలి.
– పటేల్ రాంరెడ్డి, అధ్యాపకుడు, దామరగిద్ద
సరళతరం చేయాలి..
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఈ విద్యా సంవత్సరం జీఓనంబర్ 29 అమలు చేయడంతో మిక్స్‌డ్ అక్యుపెన్సీ కళాశాలల విషయంలో ఐదేళ్ల వెసులుబాటు ఇచ్చి తాత్కాలిక ఉపశమనం కల్పించింది. సింగిల్ అక్యుపెన్సీ కాలేజీలతో పాటు మిగిలిన కళాశాలలకు జీఓను సవరించి అనుమతులు ఇవ్వాలి. కఠినంగా ఉన్న నిబంధనలు సరళీకృతం చేయాలి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అన్ని కళాశాలలకు అనుమతి ఇవ్వాలి.
– దేవేందర్‌రెడ్డి, ప్రైవేట్ కళాశాలల ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు, నారాయణపేట
●


