మహిళల చేతుల్లో ఇంధనం | - | Sakshi
Sakshi News home page

మహిళల చేతుల్లో ఇంధనం

May 29 2026 2:49 AM | Updated on May 29 2026 2:49 AM

ఆదర్శం.. నారాయణపేట మహిళా పెట్రోల్‌బంక్‌

మహిళల ఆర్థిక స్వావలంబనకు..

అప్పటి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారని నిర్వాహకులు తెలిపారు. డీఆర్డీఓ కార్యాలయం పక్కనే ఉన్న 6 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడమే కాకుండా భారత్‌ పెట్రోలియం కంపెనీ ద్వారా రూ.1.10 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళా సమాఖ్య తరఫున రూ.35 లక్షల పెట్టుబడి సమకూర్చి నిర్మాణ పనులు ప్రారంభించినట్లు వివరించారు. అయితే మధ్యలో కలెక్టర్‌ బదిలీ కావడంతో ప్రాజెక్టు నిలిచిపోతుందనే ఆందోళన నెలకొందని.. తర్వాత వచ్చిన కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ను కలిసి ప్రాజెక్టు వివరాలు తెలిపామన్నారు. ఆమె సానుకూలంగా స్పందించి అన్ని శాఖల నుంచి అనుమతులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. అధికారుల సహకారంతో పనులు పూర్తికాగా 2025, ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారన్నారు.

నారాయణపేట: ఒకప్పుడు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన మహిళలు.. నేడు రూ.కోట్ల లావాదేవీలతో పెట్రోల్‌బంక్‌ను విజయవంతంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాకేంద్రంలో డీఆర్డీఓ, జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా పెట్రోల్‌బంక్‌ ప్రస్తుతం మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచింది. మహిళల ఆత్మవిశ్వాసం, అధికారుల సహకారం, సమష్టి కృషితో ముందుకు సాగుతున్న బంక్‌ను గురువారం శిక్షణ కలెక్టర్లు శ్రీకాంత్‌రెడ్డి, సచిన్‌, సురేష్‌, పారస్‌ సందర్శించారు. మహిళా సమాఖ్య సభ్యులు, నిర్వాహకులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎంత పెట్టుబడి పెట్టారు? బ్యాంకులు, కంపెనీల సహకారం ఎలా లభించింది? ప్రస్తుతం ఆదాయం, లాభాలు ఎలా ఉన్నాయి? ఎదుర్కొన్న ఇబ్బందులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

అధికారుల ప్రోత్సాహం.. మహిళల పట్టుదల

ఉపాధి మార్గం.. లాభాల బాట

శిక్షణ కలెక్టర్లను ఆకట్టుకున్న మహిళా సమాఖ్య విజయగాథ

Advertisement
 
Advertisement
Advertisement