మక్తల్: కృష్ణా మండలం కోల్పూర్ వద్ద కృష్ణానదిపై మినీ జూరాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధఽకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కర్ణాటక నీటిపారుదలశాఖ మంత్రి బోసురాజు, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చర్చలు జరిపి బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణానికి య త్నిస్తున్నారని చెప్పారు. గురువారం నియోజకవర్గంలో మక్తల్, మాగనూర్, ఊట్కూర్ మండలాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మొదట మండలంలోని గొల్లపల్లి–మంతన్‌గోడ్ బీటీ రోడ్డు, చిట్యాల–గజరందొడ్డి మధ్య వాగుపై వంతెన పనులను పరిశీలించి నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పదవులు శాశ్వతం కాదని.. చేసిన అభివృద్ధే శాశ్వతంగా నిలుస్తోందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మక్తల్‌లో 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరుకు ప్రయత్నిస్తున్నామని.. త్వరలో తీసుకొస్తామని వెల్లడించారు. రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోతే ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో సీసీ రహదారుల నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అన్నారు. జూరాల బ్యాక్‌వాటర్ కింద ముంపునకు గురైన అంకెన్‌పల్లి భూ సేకరణకు జీఓ విడుదలైందని తెలిపారు. మంత్రి వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, మాగనూర్ మండల అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, చిట్య్లా సర్పంచ్ రహమత్‌పాషా, కౌ న్సిలర్ రహీం పటేల్, మహేష్, శంషోద్దీన్, అమరేందర్‌రెడ్డి, చిట్యాల లక్ష్మణ్, వాకిటి హన్మంతు, గోవర్ధన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి


