‘కమీషన్ల కోసమే కొడంగల్‌ ఎత్తిపోతల పనులు’ | - | Sakshi
Sakshi News home page

‘కమీషన్ల కోసమే కొడంగల్‌ ఎత్తిపోతల పనులు’

May 29 2026 2:49 AM | Updated on May 29 2026 2:49 AM

మక్తల్‌: కొడంగల్‌–నారాయణపేట–మక్తల్‌ ఎత్తిపోతల పథకం పనులు కమీషన్ల కోసమే చేపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని భూత్పూర్‌ రిజర్వాయర్‌ వద్ద రెగ్యులేటరీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ ప్రాంతంలో కొత్తగా రెగ్యులేటరీ నిర్మాణం అవసరం లేదని.. అసవసరంగా కమీషన్ల కోసం నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఒక టీఎంసీ సామర్థ్యం ఉన్న భూత్పూర్‌ రిజర్వాయర్‌ నుంచి కొడంగల్‌కు ఏ విధంగా ఏడు టీఎంసీల నీటిని తరలిస్తారని ప్రశ్నించారు. అవగాహన లేకుండా పనులు చేపడుతున్నారని.. ఇలాగే కొనసాగితే హీమా ప్రాజెక్టు కింద ఉన్న సంగంబండ, భీమా ప్రాజెక్టుకు నీళ్లు చేరవన్నారు. భీమా ప్రాజెక్టు కింద 5 మండలాల భూములుకు పూర్తిగా సాగునీరు అందక ఎడారిగా మారుతాయని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి కొడంగల్‌కు నీళ్లు సులభంగా తీసుకెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ఆయన వెంట మాజీ మార్కెట్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్‌, ఈశ్వర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement