కోస్గి మండలం చెన్నారం గ్రామంలో బంగినపల్లి రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కేంద్రం జలమయమైంది. కేంద్రంలోని 700 బస్తాల ధాన్యంతో పాటు రెండు ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని 5 ట్రాక్టర్లలో మిల్లుకు తరలించారు. కోస్గి–పల్లెర్ల ప్రధాన రహదారి బీటీని పొక్లెయిన్‌తో తవ్వి వర్షపు నీటిని బయటకు తరలించారు. నిర్వాహకులు సకాలంలో టార్పాలిన్లు ఇవ్వకపోవడం, ధాన్యం తరలింపులో నిర్లక్ష్యంతోనే నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– కోస్గి రూరల్
పాలమూరే ప్రధానాస్త్రం!
ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే
డిమాండ్‌తో బీఆర్‌ఎస్ పోరు
వచ్చే నెలలో పాదయాత్ర,
బహిరంగ సభకు సన్నాహాలు
ఇదే అంశంతో టీఆర్‌ఎస్
అధ్యక్షురాలు కవిత ఉద్యమ బాట
2027 డిసెంబర్‌లోపు
పూర్తి చేసేలా కాంగ్రెస్ కార్యాచరణ
2 రోజుల పాటు ప్రాజెక్ట్‌ల
సందర్శనకు సీఎం సమాయత్తం
పొలిటికల్ డ్రామాలకే పరిమితమని బీజేపీ విమర్శలు


