8 నిమిషాల్లో పూర్తి | - | Sakshi
Sakshi News home page

8 నిమిషాల్లో పూర్తి

May 27 2026 10:14 AM | Updated on May 27 2026 10:14 AM

ఎస్‌బీఐ ఏటీఎం దొంగతనం చేయడానికి వచ్చిన ఈ ముఠా కేవలం 8 నిమిషాల్లో పని చేసుకొని అక్కడి నుంచి పరార్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎంతో రద్దీగా ఉండే ఈ రోడ్డు మార్గంలో వాహనదారులు కూడా గుర్తించలేకపోయారు. ఏటీఎం దొంగతనం చేసిన దృశ్యాలు మొత్తం ఎదురుగా ఉన్న గురురాఘవేంద్ర సూపర్‌ మార్కెట్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్‌ కావడంతో పోలీసులు పుటేజీని పరిశీలించారు. అలాగే తెలంగాణ చౌరస్తా, అంబేడ్కర్‌ చౌరస్తా, సింధు హోట ల్‌ ఏరియాలో ఉన్న లాడ్జిలలో దొంగలు బస చేశారా అనే విషయంపై పోలీసులు ఆరా తీసినా ఎలాంటి ఫలితం కనిపించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement