గందరగోళం..!
సర్వే సమయంలోనే..
భారత్‌మాల భూ సేకరణలో అధికారుల చేతివాటం?
–8లో u
నారాయణపేట: జిల్లాలో భారత్‌మాల రహదారి భూ సేకరణ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రహదారి విస్తరణ, అభివృద్ధి పేరుతో చేపట్టిన భూ సేకరణలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు న్యాయం చేయాల్సిన అధికారులు.. కొందరు మధ్యవర్తులతో కుమ్మకై ్క పరిహారం చెల్లింపుల్లో భారీ అవకతవకలకు పాల్పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భారత్‌మాల రహదారి జిల్లాలోని మరికల్ మండలం పెద్దచింతకుంట నుంచి కృష్ణా మండలంలోని గుడెబల్లూర్ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికిగాను అధికారులు సర్వే చేసి 553.35 ఎకరాల భూ సేకరణ చేపట్టారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు గాను సుమారు రూ.214.49 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.175.70, కోట్లు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా రూ. 38.79 కోట్లు చెల్లించాల్సి ఉంది. భూ సేకరణలో వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతులు 1,463 మంది ఉండగా.. వ్యవసాయేతర భూములు కోల్పో యే వారి సంఖ్య 1,564 ఉన్నట్లు అధికారులు లెక్క లు చూపించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
● మరికల్, తీలేర్ గేట్ సమీపంలో వ్యవసాయ భూమి లెక్కన ఎకరాకు పరిహారం చెల్లించాల్సి ఉండగా.. నాలా చేయడంతో పరిహారం డబ్బులు అధికంగా చెల్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జక్లేర్, మక్తల్ టౌన్ శివారులోని భూముల్లో సైతం అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు విమర్శలు వస్తున్నాయి. గుడెబల్లూర్‌లో రెండు, మూడు సర్వేనంబర్లకు నాలా లేకున్నా.. సృష్టించి గజాల లెక్కన చెల్లించినట్లు విమర్శలున్నాయి.
● నాలా భూ పరిహారంలో పది నుంచి 20 శాతం వరకు బాధిత రైతుల నుంచి వసూలు చేసి అధికారులు తల కొంత పర్సేంటీజీ లెక్కన పంచుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఏదేమైనా భూ సేకరణలో రాజకీయ నేతల అండదండలు, అధికారుల చేతివాటంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడినట్లు తెలుస్తోంది.
మౌనం ఎందుకు..?
భూ సేకరణపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. రెవెన్యూ, భూ సేకరణశాఖ అధికారులు మాత్రం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పరిహారం లెక్కలపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో అసంతృప్తి పెరుగుతోంది. అధికారుల అనుమతి లేకుండా ఇంత పెద్ద స్థాయిలో అవకతవకలు సాధ్యమా..? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
553.35 ఎకరాల వ్యవసాయ,
వ్యవసాయేత భూమి సేకరణ
వ్యవసాయ భూములను
నాలాగా మార్చారని ఆరోపణలు
ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం
లేదంటున్న బాధితులు
భూ సేకరణ సమయంలో భూ రికార్డుల్లో మార్పు లు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు భూములను వేరే కేటగిరీలో చూపించడం, కొందరికి ఎక్కువ పరిహారం, మరికొందరికి తక్కువ చెల్లింపులు జరగడం వెనుక ఆంతర్యం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. భూ సేకరణలో జరిగిన ప్రతి లావాదేవీపై విజిలెన్స్ లేదా న్యాయ విచారణ జరిపించాలని రైతు సంఘాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
భారత్‌మాల రహదారి నిర్మాణంలో వ్యవసాయేత భూములు కోల్పోతున్న రైతులు 1,564 మంది ఉన్నట్లు సర్వేలో అధికారుల బృందం గుర్తించింది. సర్వే సమయంలోనే అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో పరిహారం అధికంగా ఇప్పించేందుకు అధికారులు వ్యవసాయ భూములకు పాత తేదీలు వేయించి పంచాయతీల్లో నామ్‌కే వస్తే తీర్మానాలు సైతం చేయించి వ్యవసాయేతర భూములుగా మార్చాలన్న ఆరోపణలు ఉన్నాయి. లేఅవుట్ సైతం రూపొందించి గజాల లెక్కన పరిహారం చెల్లించినట్లు పలువురు రైతులు బహిరంగంగానే చెబుతున్నారు. భారత్‌మాల భూ సేకరణలో ఐదు బృందాలు పాల్గొని మూడు నెలల్లో ముగించాయి. ఒక్కో బృందంలో సర్వేయర్, గిర్దావర్, వీఆర్‌ఏతో కలిసి లాల్‌కోట చౌరస్తా నుంచి గుడెబల్లూర్ కృష్ణా వంతెన వరకు చేపట్టారు. పూర్తి నివేదికను అప్పటి కలెక్టర్ కోయ శ్రీహర్షకు అందజేశారు. తర్వాత పరిహారం డబ్బుల అవార్డును అప్పటి ఆర్డీఓ, భూ సేకరణ అధికారి జారీ చేశారు. వ్యవసాయ భూమికి ఎకరాకు రూ.2.25 లక్షలు ప్రభుత్వ ధర ఉంది. పెరిగిన ధరలకు అనుగుణంగా చెల్లించినా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు దాటదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం నాలా చేసిన భూములకు గజానికి రూ.300 నుంచి రూ.500 ఉంది. అయితే మార్కెట్ విలువ ప్రకారం మూడు రేట్లు అయితే గజానికి రూ.1,500 నుంచి రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇష్టానుసారంగా గజానికి రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు వేసి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


