రైతన్నా.. యాదుంచుకో | - | Sakshi
Sakshi News home page

రైతన్నా.. యాదుంచుకో

May 26 2026 8:12 AM | Updated on May 26 2026 8:12 AM

ఇక్కడే అధికం..

పర్యవేక్షణ ఉంది

జాగ్రత్తలు పాటించాలి

పొరుగు రాష్ట్రాల నుంచి యథేచ్చగా వస్తున్న నకిలీ విత్తనాలు

–8లో u

మరికల్‌: జిల్లాలో ఏటా వందలాది మంది రైతులు నకిలీ విత్తనాల బారినపడి నష్టపోతున్నారు. తక్కువ ధరకు విత్తనాలు వస్తున్నాయని ఏజెంట్ల మాయమాటలు నమ్మి, సాగు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పోలీసులు, వ్యవసాయ శాఖ వారు సంయుక్తంగా నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. అక్రమార్కులు రూట్లు మార్చి దందాను కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4.20 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, పప్పు దినుసుల పంటలను సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో అత్యధికంగా పత్తి, వరి సాగవుతుంది. నకిలీ విత్తనాల ముఠాలు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కొందరిని తమకు అనుకూలంగా మార్చుకొని, వారికి కమీషన్లు ఇస్తామని చెప్పి అమాయక రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో రైతులు పత్తి విత్తనాలు నాటే పనుల్లో నిమగ్నమవుతున్నారు.

పట్టుబడ్డ నకిలీ విత్తనాలు

జనవరిలో వంద క్వింటాళ్ల నకిలీ విత్తనాలను (రూ.కోటి విలువ గల) జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. మరికల్‌ మండలంలోని ఎక్లాస్‌పూర్‌కు చెందిన కొందరు వ్యక్తులు దాదాపు 90 క్విటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు వాహనంలో తరలిస్తుండగా దేవరకద్రలో పట్టుబడ్డారు. ఈ విషయం బయటకు పొక్కకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దిగుమతి చేసుకున్న విత్తనాలను గతేడాది సాగు చేసిన వారికే ఫోన్‌ చేసి రైతుల పొలాల దగ్గరకు చేరవేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా విత్తనాలు వచ్చిన వారం రోజుల్లో పోలీసులకు అనుమానం రాకుండా నిర్వహిస్తారు. ఇప్పటికే జిల్లాలోని మద్దూర్‌, కోస్గి, మరికల్‌, ధన్వాడ, నర్వ, మక్తల్‌, ఊట్కూర్‌ మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలు రైతులు కొనుగోలు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కిలో విత్తనాలను రూ.1,400 చొప్పున ఒక్కొక్క రైతు 5 నుంచి 50 కేజీల వరకు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన విత్తనాలను రహస్య స్థలంలో భద్రపర్చినట్లు సమాచారం ఉంది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పకడ్బందీగా నిఘా పెడితే తప్ప వీరిని పట్టుకోలేరు.

పట్టుబడని సూత్రధారులు

ఈ దందాలో కిందస్థాయి ఏజెంట్లు లేదా స్థానిక రైతులు మాత్రమే పట్టుబడుతున్నారు. అసలు దందా నడిపేవారు ఇంతవరకు ఒక్కరూ చిక్కలేదు. మూలాలను కనిపెట్టి దందా అంతం చేయాల్సిన అధికారులు ప్రతిసారి విఫలమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఏడాది అమాయకపు రైతులు నకిలీ విత్తనాలతో పట్టుబడి కేసులను నెత్తిన వేసుకుంటున్నారు. కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలను అసలైన వాటిలా ఆకర్షించే ప్యా కింగ్‌ చేసి మార్కెట్‌లోకి వదులుతున్నారు. విత్తనాల కొనుగోలుకు సంబంధించి రైతులకు ఎలాంటి రశీదులు ఇవ్వరు. నకిలీ నిషేధిత విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోయిన రైతులు తమ మీద ఎక్కడ కేసులవుతాయోనని ఫిర్యాదుకు జంకుతున్నారు.

రూట్లు మార్చి అక్రమ దందా

చేస్తున్న దళారులు

రోహిణి కార్తెలో పత్తి విత్తనాలు

నాటేందుకు అనువు

ఇప్పటికే రైతుల వద్దకు చేరిన విత్తనాలు

నకిలీ, నిషేధిత విత్తనాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి జిల్లాకు చేరుకుంటున్నాయి. అక్రమార్కు లు సీజన్‌ కంటే ముందే విత్తనాలను వస్తువుల మాటున గమ్యస్థానాలకు చేర్చుకుంటున్నారు. కొందరు నకిలీ బిల్లులతో ట్రాన్స్‌పోర్టుల ద్వారా ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నారు.

నకిలీ విత్తనాలను నివారించేందుకు జిల్లావ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలు నిరంతరం నిఘా ఉంచాయి. రైతులు ఎవరూ నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయించే వారు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అక్రమార్కులు పట్టుబడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తాం.

– జాన్‌ సుధాకార్‌, జిల్లా వ్యవసాయ అధికారి

వ్యవసాయ శాఖ గుర్తించిన డీలరు వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలి.

ప్యాకింగ్‌ సీల్‌ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ప్యాకింగ్‌ సరిగ్గా లేని వాటిని కొనుగోలు చేయరాదు.

విత్తనాలు కొన్నప్పుడు విధిగా రశీదు తీసుకోవాలి. బిల్లుపై విత్తన రకం, లాట్‌ నంబర్‌, డీలరు సంతకం ఉండేలా చూసుకోవాలి.

విత్తన ప్యాకెట్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి వివరాలు సరి చూసుకోవాలి.

నాణ్యమైన విత్తనాల పరిమాణం, రంగు, ఆకారం ఒకే రూపంలో ఉంటాయి. చెత్త, బూజు, కీటకాలు ఉంటే నకిలీ లేదా కాలం చెల్లినవిగా గుర్తించాలి.

ముడతలు పడినట్లు, రంగు మారినట్లు, బరు వు తక్కువగా (తేలికగా) ఉన్న వాటిని గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. వీటిని పొలంలో విత్తి నష్టపోకూడదు.

Advertisement
 
Advertisement
Advertisement