ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే..
విద్యార్థుల తల్లిదండ్రుల చేతుల్లోకి ప్రభుత్వ పాఠశాలలు
అనుచిత పోస్టులు వద్దు : ఎస్పీ
● బడ్జెట్, అభివృద్ధి పనుల
బాధ్యత వారిదే..
● ఎస్‌ఎంసీ కమిటీ, ప్రధానోపాధ్యాయులకు జాయింట్ చెక్ పవర్
నామినేటెడ్ పద్ధతిలో కాకుండా ఎన్నికల విధానంలో ఏ ర్పాటు చేసే ఎస్‌ఎంసీ కమి టీ ఎంతో బలోపేతంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఉపాధ్యాయులకు చెడ్డపేరు రాకుండా చెక్ పవర్‌లో పేరెంట్‌కు అవకాశం ఉండటంతో పారదర్శకత ఉంటుంది. పాఠశాలకు సంబంధించిన నిర్ణయాధికారంలో భాగస్వాములు అవుతాం. ఊరి బడిని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది.
– కృష్ణ, పేరెంట్, ముడుమాల్
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల కంటే ఎస్‌ఎంసీ కమిటీలు బలోపేతంగా ఉంటాయి. కమిటీలో చెక్‌పవర్ పేరెంట్‌కు సైతం ఉండటంతో ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగి ఉపాధ్యాయులకు ఒత్తిడి తగ్గుతుంది. కమిటీలు బాధ్యతగా వ్యవహరిస్తూ సమావేశాలకు పేరెంట్స్‌ను తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. పాఠశాలలు మరింత బలోపేతం అవుతాయి.
– రెడ్డప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి, టీపీటీఎఫ్
ప్రస్తుతానికి ఎస్‌ఎంసీ కమిటీలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇది కొత్త విధానం ఏం కాదు. గతంలో ఉన్న దానిని తొలగించి రెండేళ్లుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేశారు. ఇవి నామినేటెడ్ పద్ధతిలో జరిగాయి. కానీ ఎస్‌ఎంసీ కమిటీలు ఎన్నికల ప్రక్రియ ద్వారా ఏర్పడుతాయి. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఆదేశాలు వస్తే అందుకు అనుగుణంగా జిల్లాలో మార్పులు చేపడుతాం.
– గోవిందరాజు, జిల్లా విద్యాధికారి
నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇకపై పాఠశాలల నిర్వహణ, బడ్జెట్ బాధ్యతలను నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులకే అప్పగించనుంది. కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు కలిసి జాయింట్ చెక్ పవర్ ఇవ్వనుంది. కమిటీలో 75 శాతం తల్లిదండ్రులు, 25 శాతం ఇతరులు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో 50 శాతం మహిళలే ఉంటారు. జాతీయ విద్యా విధానం–2020 ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు జరగనున్నట్లు సమాచారం.
● ప్రస్తుతం పాఠశాలలకు ఇస్తున్న సమగ్ర శిక్ష నిధుల్లో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరిస్తున్నాయి. ఇక పీఎంశ్రీ పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వమే నిధులు అందిస్తోంది. రెండేళ్లుగా ఎస్‌ఎంసీ కమిటీలు లేకపోవడంతో వాటి స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్, ప్రధానోపాధ్యాయుడికి కలిపి జాయింట్ చెక్ పవర్ ఉండేది. ప్రస్తుతం అమ్మ ఆదర్శ కమిటీలు నామినేట్ కావడంతో వారికి చెక్ పవర్ ఇవ్వలేదు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి..
వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠశాల నిర్వహణ, బడ్జెట్ ఖర్చులో పేరెంట్స్ కమిటీలే పవర్‌ఫుల్‌గా మారబోతున్నాయి. కమిటీ చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు జాయింట్ చెక్‌పవర్ ఇవ్వనున్నారు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఒక్క రూపాయి కూడా వాడేందుకు వీలుండదు. పాఠశాలల్లో రూ.30 లక్షల్లోపు నిర్మాణ పనులను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్టమెంట్ అనుమతి లేకుండానే ఎస్‌ఎంసీలు నేరుగా చేపట్టవచ్చు. ప్రైవేట్ కంపెనీల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను సేకరించేందుకు అనుమతి కల్పిస్తారు.
75 శాతం తల్లిదండ్రులే..
ఎస్‌ఎంసీ కమిటీలో 75 శాతం తల్లిదండ్రులు.. 25 శాతం ఉపాధ్యాయులు, పంచాయతీ సభ్యులు, కౌన్సిలర్లు, పూర్వ విద్యార్థులు, స్థానిక విద్యావేత్తలు తదితరులు ఉంటారు. మొత్తం కమిటీలో 50 శాతం మహిళలు ఉండాలనే నిబంధన ఉంది. ఈ కమిటీ పదవీకాలం రెండేళ్లు కాగా.. నెలకు ఒకసారి కమిటీ విధిగా సమావేశం అవ్వాలి.
ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ముస్లింలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు మౌలానా అబుతాలిబ్ కోరారు. ఆల్ పార్టీ ముస్లిం రైట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం రాత్రి ‘హమారీ ఆవాజ్’ పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న మౌలానా అబుతాలిబ్ మాట్లాడుతూ దేశంలో మత విద్వేషాలను వీడి అభివృద్ధి వైపు దృష్టిసారించాలని సూచించారు. అదేవిధంగా ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, నెల్లంటి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నర్సయ్య, జూలకంటి రాంరెడ్డి మాట్లాడుతూ ముస్లింల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముస్లిం లీగ్ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ షకీల్ అహ్మద్‌తోపాటు పలువురు ముస్లిం సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ముస్లిం డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని విన్నవించారు. జనాభా నిష్పత్తి ప్రకారం అన్నివర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, సచార్, రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం కోసం అందరం ఏకమవుదామని పిలుపునిచ్చారు. అలాగే సభలో టీఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కాచం సత్యనారాయణ, ప్రొఫెసర్ ఇస్లాముద్దీన్ ముజాహిద్, ప్రముఖ సామాజికవేత్త జిలకరి శ్రీనివాసులు తదితరులు ప్రసంగిస్తూ ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలని అవసరం ఉందన్నారు. సభలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, హజ్రత్ మర్దాన్‌అలీషా దర్గా పీఠాధిపతి అబ్దుల్‌రజాక్‌షా ఖాద్రీ, జేఏసీ కమిటీ ప్రతినిధులు ఖాజా ఫయాజుద్దీన్ అన్వర్‌పాష, హనీఫ్ అహ్మద్, ఎస్‌ఎం ఖలీల్, జాకీర్ అడ్వకేట్, మోసీన్‌ఖాన్, మౌలానా నాసిర్ మజహరి, ఇస్మాయిల్, మహ్మద్ అహ్మద్ అలీ సనా, హాఫిజ్ ఇద్రీస్, షేక్ సిరాజుద్దీన్, మౌలానా ఖవి, సాధిక్ హుస్సేన్, తయ్యబ్ బాష్వార్, అబ్దుల్లా సున్నీ తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట: సామాజిక మాధ్యమాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, విధ్వేషాలు రెచ్చ గొట్టేలా, మత, కుల భావోద్వేగాలను దెబ్బతీసేలా పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ ని ఎస్పీ డా. వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో హె చ్చరించారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగాం, వాట్స ప్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఓ వర్గాన్ని కించపరిచేలా లేదా ప్రజల్లో ఉద్రిక్తతలు రేకెత్తించేలా పోస్టులు చేసిన వారితో పాటు వాటిని ఫార్వర్డ్ చేసి న వారిపైనా కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నా రు. అదేవిధంగా వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లు తమ గ్రూపుల్లో జరిగే కార్యకలాపాలపై బాధ్యత వహించా ల్సి ఉంటుందని.. తెలియని వీడియోలు, పాత ఘటనలకు సంబంధించిన ఫొటోలు లేదా అసత్య సమాచారాన్ని నిర్ధారించకుండా షేర్ చేయవద్దని సూచించారు. సామాజిక మాధ్యమాలను మంచి పనులు, సమాచార మార్పిడికే వినియోగించాలని, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తే ప్రత్యేక నిఘా వ్యవస్థ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఇలాంటి కార్యకలాపాలపై పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని, అనుమానాస్పద పోస్టులు లేదా సందేశాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల ని ఎస్పీ ప్రజలను కోరారు. సామాజిక బాధ్యతతో సోషల్ మీడియాను వినియోగించి శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నిధుల వినియోగంలో పారదర్శకత పాటించేందుకు ప్రభుత్వ ఆడిట్తో పాటు వార్షిక సోషల్ ఆడి ట్ తప్పనిసరి చేస్తున్నారు. బడులకు వచ్చే ప్రతి పైసా ఖర్చుల వివరాలను పబ్లిక్ నోటీస్‌బోర్డుపై బహిరంగంగా ప్రదర్శించాలి.జీరో టాలరెన్స్ వి ధానాన్ని పాటిస్తూ ఏవైనా అవకతవకలు జరిగితే పోలీస్, ఆరోగ్యశాఖతో కలిసి చర్యలు తీసుకునే అధికారం ఎస్‌ఎంసీలకు కల్పిస్తున్నారు.


