మక్తల్: విద్యార్థులు కష్టపడి చదివితేనే బంగార భవిష్యత్ ఉంటుందని నేరెడు గోం పీఠాధిపతి సిద్ధలింగేశ్వర మహాస్వా మి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఓ మినీ ఫంక్షన్‌హాల్ లో బీటీఎం సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మక్తల్, మాగనూర్, కృష్ణా, ఊట్కూర్, నర్వ మండలాలకు చెందిన సుమారు 200 మంది పది, ఇంటర్ టాపర్ల సన్మాన కార్యక్రమం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులు, గురువులు, గ్రామం, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని.. క్రీడాలు, చదువులో రాణించాలన్నారు. విద్యార్థులు చెడుకు బానిస కాకుండా క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఫౌండేషన్ అన్నివిధాలుగా అండగా ఉండటంతో పలువురు అభినందించారు. అనంతరం డాక్టరేట్ పొందిన తిమ్మయ్యను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తిమ్మయ్య, సుభిక్ష అగ్రి ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు గరిడి నరేందర్, పులిరాజు, రాఘవేందర్‌రావు, అయ్యప్ప, టి.నాగ రాజు, మాజీ సర్పంచ్ అశోక్‌గౌడ్, సత్యనారాయణ, కృష్ణయ్య, వెంకట్, సోఫీ, రవి, నింగప్ప, చంద్రశేఖర్, శ్యాం, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
‘పది’ టాపర్లకు సన్మానం..
పదోతరగతిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, మక్తల్‌శాఖ అధ్యక్షుడు నర్సింహులు ఆధ్వర్యంలో సోమవారం మండల విద్యాధికారి ఖాజా అమీరోద్దీన్ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నర్సింహ, రవీందర్, నాగార్జున, భీంరెడ్డి, వెంకట్రాములు, జిల్లా కార్యదర్శి శివశంకర్, రామాంజనేయులు, నరేందర్‌రెడ్డి, వెంకటేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


