ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

May 25 2026 10:03 AM | Updated on May 25 2026 10:03 AM

నారాయణపేట: అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక అధికారులను ఆదేశించారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్‌ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణా భివృద్ధి, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు తదితరులు అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడి యో కాన్ఫరెనన్స్‌ నిర్వహించారు. సమావేశంలో ధా న్యం కొనుగోళ్లతో పాటు సోమవారం నుంచి చేపట్టనున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక మహిళా సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధికారులతో సమావేశమయ్యా రు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడే పరిస్థితులు లేకుండా చర్యలు తీసుకోవాలని.. యుద్ధప్రాతిపదికన పది రోజుల్లోగా కొనుగోళ్లు పూ ర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గోదా ముల కొరత, లారీలు, హమాలీల సమస్యలు ఎక్క డ ఉన్నా తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా ట్యాబ్‌ ఎంట్రీలు, డేటా అప్‌డేషన్‌ను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులకు గురిచేసే మధ్యవర్తులు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాల ని హెచ్చరించారు. తాలు, తరుగు పేరుతో రైతుల ను మోసం చేసే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పొలాల్లో పంట అవశేషాలను కాల్చడంతో వాతావరణ కాలుష్యం పెరగడంతో పాటు నేల సారం దెబ్బతింటుందని.. రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించే మహిళా సంక్షేమ వారోత్సవాలు విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ డా. వినీత్‌, పౌరసరఫరాల సంస్థ డీఎం సైదులు, డీడబ్ల్యూఓ రాజేందర్‌గౌడ్‌, జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌ సుధాకర్‌, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి బాలరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement