‘చేయూత’ ఎందరికో..! | - | Sakshi
Sakshi News home page

‘చేయూత’ ఎందరికో..!

May 24 2026 1:03 AM | Updated on May 24 2026 1:03 AM

ప్రభుత్వ నిబంధనల మేరకే..

అర్హతలు ఇవే..

కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం దృష్టి

జిల్లాలో ప్రస్తుతం 72,734 మంది

లబ్ధిదారులు

ఏళ్లుగా దరఖాస్తుదారుల

ఎదురుచూపులు.. నెరవేరనున్న ఆశలు

మరికల్‌: చేయూత పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి ఆశలు నెరవేరనున్నాయి. అర్హులైనా లబ్ధి పొందక ఇన్నాళ్లు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. వివిధ కారణాలతో కొత్త పింఛన్ల మంజూరును ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా వచ్చే నెల 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి పంపిణీ చేయాలని నిర్ణయించడం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తే. అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించడం విశేషం.

జూన్‌ 2 నుంచి..

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2 నుంచి ‘చేయూత’ పథకం కింద కొత్త పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జిల్లాల వారీగా అర్హులైనా వారి జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరా జ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ జిల్లా పరిపాలన అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్లుగా కొత్తవి మంజూరు చేయకపోవడంతో ఎంతోమంది అర్హులైన లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వర కు కేవలం మృతిచెందిన వారి స్థానాల్లో వారి భార్యలకు మాత్రమే వితంతు పింఛన్లు మంజూరవుతున్నాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా వందల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని నిరీక్షిస్తున్నారు.

కొత్త వారికి అవకాశం..

ప్రస్తుతం ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా అనర్హుల లెక్క తేలనుండటంతో వారి స్థానంలో కొత్త వారికి పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2023, డిసెంబర్‌లో నిర్వహించిన ప్రజాపాలనలో అర్జీలు స్వీకరించారు. ఇందులో చేయూత పింఛన్ల కు జిల్లా వ్యాప్తంగా 50 వేలకు పైగా దరఖాస్తులు రా వడం గమనార్హం. ఇవేగాక ప్రజావాణిలో వేలాది మంది అ ర్జీ చేసుకున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏళ్లుగా నిరీక్షిస్తున్న వారికి పింఛన్‌ అందే అవకాశం ఉంది.

యాప్‌లో నమోదు ఇలా..

చేయూత పింఛన్‌దారుల వివరాలు ముఖ గుర్తింపు యాప్‌లో నమోదు చేస్తున్నారు. మృతిచెందిన, వలస వెళ్లిన వారితో పాటు జీవించి ఉన్న లబ్ధిదారుల వివరాలతో జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. జాబితాల రూపకల్పన అనంతరం గ్రామసభలు నిర్వహించి మృతిచెందిన వారి పేర్లను సభ ఆమోదంతో తొలగించేందుకు చర్యలు తీసుకోనున్నారు. దీంతోపాటు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చేపడుతున్నారు. ఇది వరకు వచ్చిన అర్జీలను పరిశీలించడంతో పాటు గ్రామాల్లో అర్హులైన వారుంటే కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని ఎంపీడీఓలు గ్రామపంచాయతీ కార్యదర్శులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రామాల్లో అర్హులైన వారి నుంచి అర్జీలు తీసుకునే పనిలో కార్యదర్శులు నిమగ్నమయ్యారు. కొన్ని మండలాల్లో గతంలోనే అర్హులైన వారు దరఖాస్తులు సైతం సమర్పించారు.

కొత్తగా పింఛన్ల కోసం దర ఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించి ప్రభు త్వ నిబంధనల మేరకు ఎంపిక చేస్తాం. మీ–సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే మండల అధికారులు పరిశీలన చేసి అర్హుల జాబితాను రూపొందించి ఉన్నతాధికారులకు నివేదిస్తారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కొత్త వారు కూడా చేసుకోవచ్చు.

– జయన్న, డీపీఎం, నారాయణపేట

వృద్ధాప్య పింఛన్‌కు రాష్ట్ర నివాసిగా ఉంటూ 57 ఏళ్లు నిండిన వారు అర్హులు. ఆధార్‌, ఓటరు ఐడీ, రేషన్‌కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా పాసుపుస్తకం కలిగి ఉండాలి.

వితంతు పింఛన్‌కు కనీసం 18 ఏళ్లు నిండి భర్త మరణ ధ్రువీకరణ పత్రం జత చేయాలి.

దివ్యాంగులకు వయోపరిమితి లేదు. కనీసం 40 శాతానికిపైగా వైకల్యం ఉంటే సరిపోతుంది. సదరం ధ్రువీకరణ పత్రం, యూడీఐడీ కార్డు, ఆదాయ ధ్రువీకణ పత్రం ఉండాలి.

చేనేత, కల్లుగీత కార్మికుల పింఛన్‌కు కనీసం 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. సంబంధిత సొసైటీ గుర్తింపు కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం ఉండాలి.

బీడీ కార్మికుల పింఛనుకు 50 ఏళ్లలోపు ఉండి గుర్తింపు పత్రం తప్పనిసరిగా దరఖాస్తుకు జత చేయాలి.

Advertisement
 
Advertisement
Advertisement