దేవరకద్ర: హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి ఐక్యపరిచి మనదేశాన్ని విశ్వగురువుగా నిర్మాణం చేయాలనే లక్ష్యం చేరుకోవాలని తెలంగాణ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌స్వామిజీ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి దేవరకద్రలో శ్రీనివాసగార్డెన్‌లో హిందూ సమ్మేళన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్వామిజీ మాట్లాడుతూ.. యువత భారతీయ సంస్కృతిని కాపాడటంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. హిందూ సమాజంలో ఐక్యత సేవాభావం పెంపొందిచడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు.
ధర్మరక్షణకు ముందుకు రావాలి
సమాజంలో సనాతన ధర్మ విలువలను పరిరక్షించాల్సి అవసరం ఉందని, మహిళలు, యువత సామాజిక చైతన్యంతో ముందుకొచ్చి భారతీయ సంస్కృతిని భావితరాలకు అందిచాలని హైకోర్టు న్యాయవాది మౌనిక సుంకర కోరారు. ఆమె ముక్యవక్తగా ప్రసంగించారు. సంస్కార భారతి ప్రాంత సంఘటన మంత్రి నిరంజన్, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొండ ప్రశాంత్‌రెడ్డి, ఉత్సవ సమితి అధ్యక్షుడు ఆంజనేయులు, కల్వ నరేష్, భాస్కర్ పాల్గొన్నారు.
పోరాటాల ఫలితంగానే వేతనాలు పెంపు
జడ్చర్ల టౌన్: పోరాటాల ఫలితంగానే కార్మికుల వేతనాలు పెంచటం జరిగిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సురేష్ అన్నారు. శనివారం జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సిద్ద సెక్యూరిటి, పేషెంట్ కేర్ విభాగాల కాంట్రాక్టు కార్మికుల సంయుక్త సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2012 నుంచి కనీస వేతనాల జీఓల సవరణకు నోచుకోక కార్మికులు ఆర్థిక నష్టంతోపాటు శ్రమ దోపిడీకి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పెంచిన కనీస వేతనాలపెంపు శాసీ్త్రయంగా లేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26వేలకు పెంచాలన్నారు. సీఎం స్పందించి కనీస వేతనం పెంచుతూ జీఓ సవరించాలన్నారు. అలాగే జడ్చర్ల ఏరియా ఆస్పత్రిలో కాంట్రాక్టు పారిశుద్ధ్య, సెక్యూరిటి పేషెంట్ కేర్, సూపర్‌వైజర్ కార్మికులకు చెల్లిస్తున్న వేతనాల చెల్లింపులో ఏజెన్సీ కాంట్రాక్టర్, అధికారుల అలసత్వం, అవినీతి అక్రమాలపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించి విచారణ జరిపించాలని కోరారు. కార్మికులకు దాదాపు మూడునెలలుగా వేతనాల చెల్లింపు ఆపేశారని, దీనివల్ల కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్, ఆస్పత్రి యూనియన్ నాయకులు నర్సింహ, నవీన్ పాల్గొన్నారు.


