ఒకే ఇంట్లో మూడు కుటుంబాలు.. | - | Sakshi
Sakshi News home page

ఒకే ఇంట్లో మూడు కుటుంబాలు..

May 24 2026 1:03 AM | Updated on May 24 2026 1:03 AM

ఒకే ఇంట్లో మూడు కుటుంబాలు.. సమస్యలు తీర్చాలి.. పరిష్కారానికి చర్యలు..

మాకు పునరావాస కేంద్రంలో ఒకే ప్లాటు ఇచ్చారు. నా కు ఇద్దరు కొడుకులు ఉన్నా రు. వారికి పెళ్లిళ్లు అయ్యా యి. పిల్లలు ఉన్నారు. ఒకే ఇంట్లో మూడు కుటుంబాలతో జీవనం సాగిస్తున్నాం. ఇద్దరు కుమారులకు ప్లాట్టు ఇవ్వాలని పాత ఊరిలో ఉన్నప్పుడే అడిగాం. ఎవరూ పట్టించుకోలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పి చెప్పి విసుగొచ్చింది. మా గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు.

– లక్ష్మి, చిన్నోనిపల్లె

చిన్నోనిపల్లె పునరావాస కేంద్రంలో ఒక్క ప్రభుత్వ భవనం కూడా లేదు. అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాన్ని పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలి. పునరావాస సమస్యలపై ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ ప్రత్యేక దృష్టిసారించి పరిష్కరించాలి.

– యు.దేవేందర్‌, సర్పంచ్‌, చిన్నోనిపల్లె

చిన్నోనిపల్లె పునరావాస కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇదివరకే పునరావాస కేంద్రంలో చేపట్టిన వివిధ పనులు పురోగతిలో ఉన్నాయి. 360 కుటుంబాలకు షిఫ్టింగ్‌ చార్జీలను చెల్లించడం జ రిగింది. ఇంకా ఎవరైనా ఉంటే, వారికి అందించే విధంగా చర్యలు తీసుకుంటాం.అన్ని శాఖల అఽ దికారులను సమన్వయం చేసుకుని పునరావాస కేంద్రంలోని సమస్యలను పరిష్కరిస్తాం.

– శ్రీనివాసరావు, ఆర్డీఓ, గద్వాల

Advertisement
 
Advertisement
Advertisement