పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

May 23 2026 12:40 AM | Updated on May 23 2026 12:40 AM

నారాయణపేట: పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని.. జిల్లాను మరో కోనసీమగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడా రు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రూ.5 వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకంతో లక్ష ఎకరాలకు సాగునీరు అందించి వలసల బాధను శాశ్వతంగా తొలగిస్తామన్నారు. కాట్రేవ్‌పల్లి నుంచి కానుకుర్తి వరకు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని.. గతంలో వలసల జిల్లాగా పేరున్న నారాయణపేటను వలసలు వచ్చే జిల్లాగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాల అమలుతో ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మొదట ప్రజలకు నమ్మకం లేకపోయినా.. ప్రస్తుతం గ్రామగ్రామాన గృహ ప్రవేశాల పండుగలు కొనసాగుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సర్పంచులు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు రాజకీయాలకు అతీతంగా గ్రామాలు, పురపాలికల అభి వృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రైతులు పండించిన సన్నరకం వరికి బోనస్‌తో పాటు గిట్టుబాటు ధర అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి పేదవాడికి నెలకు 6 కిలోల సన్న బియ్యం రేష న్‌ షాపుల ద్వారా అందిస్తున్నామని.. ప్రతి గ్రామానికి ఓ రేషన్‌ దుకాణం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అధికారుల పాత్ర కీల కమని.. పెండింగ్‌ దస్త్రాల పరిష్కారం, అభివృద్ధి ప నులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించా రు. ప్రజాప్రతినిధులు చెప్పిన సమస్యలను అధికారు లు గౌరవంగా స్వీకరించి పరిష్కారానికి కృషి చేయా లని కోరారు. ఉచిత బస్సు ప్రయాణంతో మ హిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు అందిస్తున్నామని, మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రో ల్‌ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ కొనసాగుతుండటం మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు.

ప్రజల చేరువకే గ్రామ, వార్డుసభలు..

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు గ్రామ, వార్డుసభలు నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి అవకాశాలు అందించడమే లక్ష్యమన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక మార్చి 6న ప్రారంభమై జూన్‌ 12 వరకు కొనసాగుతుందని.. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, సంక్షేమం, రైతు, మహిళా సాధికారత, యువత, పర్యావరణం తదితర 10 థీమ్స్‌ ఆధారంగా కార్యాచరణ కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీను, ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్‌, ఆర్డీఓ రమేష్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వార్ల విజయకుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సర్పంచులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

– నారాయణపేటను మరో కోనసీమగా తీర్చిదిద్దుతాం

– రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి

వాకిటి శ్రీహరి

Advertisement
 
Advertisement
Advertisement