ప్రభుత్వం కేవలం ఆయిల్ పాం సాగును మాత్రమే ప్రోత్సహించకుండా మిగిలి న ఉద్యాన పంటల సాగుకు సైతం ప్రాధాన్యం ఇవ్వాలి. రైతులకు గతంలో మాదిరి గా ఎలాంటి కోత విధించకుండా డ్రిప్ పరికరా లను రాయితీపై అందించేందుకు చర్యలు చేప ట్టాలి. సాంప్రదాయ పంటలు కాకుండా ఉద్యా న సాగు చేసుకునేటట్లు పరికరాలను సబ్సిడీపై అందించాలి.
– ఎం.రాములు, రైతు, పెద్దకడ్మూర్
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం పెంపునకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇప్పటికే రైతులకు రాయితీపై మొక్కలు, పరికరాలు అందిస్తున్నాం. డ్రిప్, స్ప్రింక్లర్లకుగాను రైతులకు అందించే రాయితీలో పది శాతం కోతను ప్రభుత్వం విధించింది. ఇతర ఉద్యాన రైతుల వినతులను ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
– సాయిబాబు, జిల్లా ఉద్యాన అధికారి


