దామరగిద్ద: రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచి నేల ఆరోగ్యాన్ని కాపాడాలని వ్యవసాయ శాస్త్రవేత్త శైలజ అన్నారు. గురువారం మండలంలోని లోకూర్తి రైతు వేదికలో సర్పంచ్ రాజు సమక్షంలో జిల్లా రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు పంటల సాగులో చేపట్టాల్సిన సస్యరక్షణ, విత్తనాలు, ఎరువులు కలుపు మందులు, నీటి యాజమాన్యం, వ్యవసాయ యాంత్రీకరణ వంటి యాజమాణ్యం పద్ధతులపై రైతులు అవగాహన కల్పించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి పచ్చిరొట్ట పశువుల పేడ వంటి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలన్నారు. డ్రోన్‌లు ఇతర యాంత్రీక పరికాలను ఉపయోగించి వ్యవసాయం చేయాలన్నారు. మండల వ్యవసాయ అధికారి బాలాజీ ప్రసాద్ మాట్లాడుతు మేలైన విత్తనాలు ఎంచుకోవాలని పంట మార్పిడితో నేల సారాన్ని పెంచుకోవడంతో పాటు పంటల దిగుబడి పెరుగుతుందన్నారు. ప్రతి రైతు విధిగా పార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజు, ఏఓ బాలాజీ ప్రసాద్, అపేడ్ అసిస్టెంట్ మేనేజన్ సుఖేష్, ఏఈఓ అజయ్‌కుమార్, రైతులు భీంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.


