అక్రమ రవాణాపై నిఘా | - | Sakshi
Sakshi News home page

అక్రమ రవాణాపై నిఘా

May 21 2026 12:20 AM | Updated on May 21 2026 12:20 AM

తగిన పత్రాలుంటేనే..

నిబంధనలు పాటించాలి..

అధికారుల పర్యవేక్షణ..

జిల్లాలో ఏడు చెక్‌పోస్టుల ఏర్పాటు

పశువుల తరలింపు నియంత్రణకే..

ఇప్పటి వరకు ఒక కేసు నమోదు

బక్రీద్‌ నేపథ్యంలో పకడ్బందీ తనిఖీలు

–8లో u

పశువులను తరలించే ప్రతి వాహనానికి నిర్ధారిత ప్రామాణిక పత్రాలు అవసరమని అధికారులు ప్రకటించారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు ఇదే నిబంధనలు వర్తిస్తాయి. తనిఖీ సమయంలో ఏదైనా వాహనం పశువులతో ఉన్నట్లు గుర్తిస్తే అన్ని పత్రాలు తనిఖీ చేయాలని, అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నారాయణపేట రూరల్‌: గోవులు, గో సంతతి అక్ర మ రవాణా, గోవధను అరికట్టేందుకు పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ తదితర సంఘాల నుంచి ఉన్నతాధికారులకు వచ్చిన వినతుల ఆధారంగా అవసరమైన చర్యలు చేపట్టారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలు, పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులతో పకడ్బందీగా వ్యవహరించేందుకు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గట్టి నిఘా ఏర్పాటు చేసి విసృతంగా తనిఖీలు చేస్తున్నారు.

నిరంతర పర్యవేక్షణ..

జిల్లా సరిహద్దుగా కర్ణాటక ఉండటంతో పశు అక్ర మ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఓ పక్క ఇతర జిల్లాలు, మరోపక్క రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలతో పాటు ప్రధాన మార్గాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ము ఖ్యంగా ఆరు సరిహద్దు, ఒక అంతర్‌ జిల్లా చెక్‌పోస్టు ప్రారంభించి పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి మూడు షిఫ్టులలో పనిచేసే విధంగా చర్యలు చేపట్టారు. అక్రమంగా గోవులు, దూడలను తరలించకుండా అడ్డుకోవాలని సిబ్బందికి అధికారులు సూచించారు. ఒకవేళ ఎవరైనా గోవులను వధించేందుకు తరలిస్తే సంబంధిత వాహనాన్ని జప్తు చేస్తారు. తరలించిన వ్యక్తి సంబంధిత వాహన యజమానిపై గోవధ నిషేధ చట్టం కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తారు.

ఒక కేసు నమోదు..

చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది వారం రోజులుగా పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక నుంచి మూడు ఎద్దులు, ఒక గేదె, ఒక బర్రె పోతుతో నారాయణపేట వైపు వస్తున్న కర్ణాటక వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తుండటంతో వాహనాన్ని సీజ్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి వాహనంలోని పశువులను దగ్గరలోని గోశాలలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన వసతి కేంద్రంలో ఉంచారు.

పశువుల రవాణా విషయంలో నిబంధనలు విధిగా పాటించాలి. అక్రమంగా తరలిస్తే వాహనాలు స్వాధీనం చేసుకోవడమే కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. బక్రీద్‌ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. మతసామరస్యానికి భంగం వాటిల్లే సందేశాలు పంపిన, ప్రచారం చేసిన కఠిన చర్యలు ఉంటాయి.

– డా. వినీత్‌, ఎస్పీ, నారాయణపేట

జిల్లాలోని జలాల్‌పూర్‌, కాన్‌కుర్తి, సమస్తాపూర్‌, చేగుంట, కృష్ణా వంతెన, ఉజ్జెలి, లాల్‌కోట ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఉంటాయి. ఆయా చెక్‌ పోస్టులను ఎస్పీ డా. వినీత్‌, అడిషనల్‌ ఎస్పీ రియాజ్‌ హుల్‌హుక్‌, డీఎస్పీ లింగయ్యతో పాటు సంబంధిత సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలిస్తున్నారు. చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement