‘చిరు’ సాగుపై అనాసక్తి | - | Sakshi
Sakshi News home page

‘చిరు’ సాగుపై అనాసక్తి

Mar 24 2026 8:44 AM | Updated on Mar 24 2026 8:44 AM

అరకలు సాగు చేశా.. అవగాహన కల్పిస్తాం..

క్షేత్రస్థాయిలో లోపించిన అవగాహన

ఉమ్మడి జిల్లాలో వంద క్వింటాళ్లు దాటని దిగుబడి

మార్కెట్‌లో పెరిగిన డిమాండ్‌

ప్రతి ఏటా మా బంధువులు చిరుధాన్యల సాగుతో అధిక లాభాలు అర్జిస్తున్నారు. వారిని అనుసరించి యాసంగిలో పంటమార్పిడి చేసి రెండు ఎకరాల్లో అరకలు సాగు చేశా. పంట నాటిన నుంచి ఇప్పటి వరకు రూ.25 వేల పెట్టబడి అయింది. మరో నెల రోజుల్లో కోతకు రానుంది. అధిక దిగుబడి వస్తే వచ్చే యాసంగిలో సాగును మరింత విస్తారిస్తా.

– కొండాపూర్‌ వెంకట్‌రెడ్డి, రైతు, మరికల్‌

మార్కెట్‌లో అధిక ధరలున్న చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి. ఇలాంటి పంటలను సాగు చేస్తే రైతులు అధిక లాభాలు పొందవచ్చు. రెండేళ్లుగా అవగాహన కల్పిస్తున్నాం. రైతులు అక్కడక్కడ ముందుకొచ్చి ఎకరా నుంచి రెండు ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. మిగతా రైతులు కూడా ఆసక్తి కనబరిస్తే సాగుపై అవగాహన కల్పిస్తాం.

– జాన్‌ సుధాకర్‌,

జిల్లా వ్యవసాయశాఖ అధికారి

మరికల్‌: రాష్ట్ర ప్రభుత్వం పంట మార్పిడి చేసి కొత్త రకం పంటలను సాగు చేయాలని పదే పదే చెబుతున్నా.. రైతులు మాత్రం మూస పద్ధతిని మాత్రం వీడ టం లేదు. ఉమ్మడి జిల్లాలో చిరుధాన్యాల సాగుకు అన్నదాతలు ఆసక్తి చూపక పూర్తిగా తగ్గింది. ప్ర స్తుతం వీటి వినియోగం భారీగా పెరిగినా.. సాగు మాత్రం తగ్గుతోంది. ఐదేళ్ల కిందట రైతులు ఎంతో కొంత చిరు ధాన్యాలను సాగు చేసేవారు. అయితే కొందరికి ఎక్కడ విక్రయించాలో తెలియక సాగును తగ్గిస్తూ వచ్చారు. ఆయా పంటలను పక్కనబెట్టి వర్షాకాలంలో మాత్రం జొన్న సాగు చేస్తున్నారు. ప్రస్తుత యాసంగిలో ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ రాగులు, జొన్నలు సాగు చేసినప్పటికీ ఇతర చిరు ధాన్యాలైన కొర్రలు, అరికలు, ఊదలు, సామలు, అడ్డుకొర్రలు కనిపించడం లేదు. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో చిరుధాన్యల సాగుపై రైతులు దృష్టి సారించేలా అవగాహన కల్పించి ఉంటే కొంతమేరకై నా మొగ్గు చూపేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు అధిక శాతం వరి, పత్తి, మొక్కజొన్న సాగుపై దృష్టి సారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement