అర్జీలు సత్వరం పరిష్కరించాలి : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

అర్జీలు సత్వరం పరిష్కరించాలి : కలెక్టర్‌

Mar 24 2026 8:44 AM | Updated on Mar 24 2026 8:44 AM

నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు ప్రాధాన్యతనిస్తూ.. ప్రజల అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన నేరుగా తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 37 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి.. పరిష్కార మార్గం చూపాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఫణీంద్ర రెడ్డి, అదనపు కలెక్టర్‌ శ్రీను పాల్గొన్నారు.

● నూతన కలెక్టరేట్‌ భవన సముదాయం ఆవరణలో రోడ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ భవన నిర్మాణాన్ని ఆయన పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్‌ భవన సముదాయం వరకు సమాంతరంగా రోడ్డు నిర్మించాలన్నారు. అదే విధంగా భవన సముదాయం సమీపంలో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను అక్కడి నుంచి తొలగించాలని తెలిపారు. భవనం చుట్టూ నాలువైపులా మొక్కలు నాటించి, గ్రీనరీ ఏర్పాటు చేయాలని డీఆర్డీఓ మొగులప్పకు సూచించారు. కలెక్టర్‌ వెంట ఆర్‌అండ్‌బీ డీఈఈ రాములు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement