మిగిలింది 9 రోజులే.. | - | Sakshi
Sakshi News home page

మిగిలింది 9 రోజులే..

Mar 23 2026 9:09 AM | Updated on Mar 23 2026 9:09 AM

వందశాతం లక్ష్యంగా..

నారాయణపేట
ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అంతంతమాత్రంగానే పన్నుల వసూళ్లు

గడువు దగ్గర పడుతుండటంతో

వేగం పెంచిన అధికారులు

ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో స్పెషల్‌ డ్రైవ్‌

పుర ఎన్నికలు, సిబ్బంది

కొరతతోనే జాప్యం

సోమవారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2026

నారాయణపేట: మున్సిపాలిటీల అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులతోపాటు ఆస్తి పన్ను వసూళ్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. మున్సిపాలిటీల్లోని నివాస, వాణిజ్య సముదాయాలకు సంబంధించి 2025– 26 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లపై పుర యంత్రాంగం దృష్టిసారించింది. క్యూఆర్‌కోడ్‌ స్కాన్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ, వాట్సప్‌ నంబర్‌, ఏటీఎం ద్వారా నేరుగా ఆయా పురపాలికల ఖాతాల్లో జమ చేయవచ్చని చెబుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు పన్ను వసూళ్లకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు పన్ను వసూలు అంతంత మాత్రమే ఉండటం.. లక్ష్యం చేరుకునేందుకు కేవలం 9 రోజులు మాత్రమే గడువు ఉండటంతో అధికారులు, సిబ్బంది వసూళ్లలో వేగం పెంచారు.

నారాయణపేటలో ఆస్తి పన్ను వసూలు చేస్తున్న మున్సిపల్‌ సిబ్బంది (ఫైల్‌)

ఏటా మార్చిలోనే అత్యధికంగా పన్ను వసూళ్లు అవుతాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.. ప్రజాపాలన–పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పన్ను వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. పుర ప్రజలు, వ్యాపారులు ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలి. వారం రోజులుగా పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించాం. ఈ నెల 31 వరకు వంద శాతం పన్ను వసూలు చేసేందుకు కృషి చేస్తున్నాం. – నర్సయ్య,

పుర కమిషనర్‌, నారాయణపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement