ఆదాయం అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

ఆదాయం అంతంతే..

Mar 22 2026 5:27 AM | Updated on Mar 22 2026 5:27 AM

నారాయణపేట

ఆదివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2026

తలసరి ఆదాయంలో అట్టడుగునే నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాలు

జీడీడీపీ.. (ప్రస్తుత ధరల వద్ద.. రూపాయల్లో)

మహబూబ్‌నగర్‌

నాగర్‌కర్నూల్‌

వనపర్తి

జో.గద్వాల

నారాయణపేట

17,278

28,471

37,456

సాక్షి, నాగర్‌కర్నూల్‌: దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. అన్ని రంగాల్లో క్రమంగా వృద్ధి కనిపిస్తోంది. కానీ రాష్ట్రంలో మిగతా జిల్లాల కన్నా ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్‌ మినహా నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలు తలసరి ఆదాయం విషయంలో అట్టడుగు స్థానంలో కొనసాగుతున్నాయి. నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 28వ స్థానంలో కొనసాగుతుండగా, జోగుళాంబ గద్వాల జిల్లా 26వ స్థానంలో ఉంది. వస్తు సేవల ఉత్పత్తిలో ప్రామాణికంగా నిలిచే జీడీడీపీ విషయంలోనూ ఈ జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. తెలంగాణ సోషియో ఎకనామిక్‌ అవుట్‌ లుక్‌ సర్వే 2026లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

● ఏడాదిలో వ్యక్తులకు లభిస్తున్న సగటు ఆదాయం విషయంలో మహబూబ్‌నగర్‌ మినహా మిగతా జిల్లాలు అట్టడుగునే కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్‌ తలసరి ఆదాయం రూ. 3.36 లక్షలతో రాష్ట్రంలోనే 6వ స్థానంలో మెరుగ్గా ఉంది. నారాయణపేట జిల్లా రూ.2.59 లక్షల తలసరి ఆదాయంతో 28 స్థానంలో, గద్వాల జిల్లా రూ. 2.66 లక్షలతో 26వ స్థానంలో ఉండగా, వనపర్తి జిల్లా రూ.2.74 లక్షలతో 21వ స్థానం, నాగర్‌కర్నూల్‌ జిల్లా రూ. 2.79 లక్షల తలసరి ఆదాయంతో 19వ స్థానంలో నిలిచింది.

● వస్తుసేవల ఉత్పత్తిలోనూ పాలమూరు జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. ప్రస్తుత ధరల వద్ద జీడీడీపీ రూ.37,456తో మహబూబ్‌నగర్‌ జిల్లా 11వ స్థానంతో మెరుగ్గా కనిపిస్తుండగా, మిగతా జిల్లాలు వెనుకబడ్డాయి. నారాయణపేట జిల్లా రూ.17,278 జీడీపీపీతో 29వ స్థానంలో ఉండగా, వనపర్తి జిల్లా 27వ స్థానం, గద్వాల 26వ స్థానం, నాగర్‌కర్నూల్‌ జిల్లా 19వ స్థానంలో ఉంది.

● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆశించినంతంగా పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు. చిన్న తరహా పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాల ద్వారా స్థానికులు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. కానీ ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు తక్కువగా ఉంది. అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 8,165 ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటుకాగా, అతి తక్కువగా నారాయణపేట జిల్లాలో 2,298 యూనిట్లు మాత్రమే ఉన్నాయి.

నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 29వ స్థానం

జీడీడీపీలోనూ పాలమూరు

జిల్లాలు వెనుకంజ

తెలంగాణ సోషియో ఎకనామిక్‌ అవుట్‌ లుక్‌ సర్వేలో వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement