ఎస్టీ కమిషన్‌ అంటే అధికారులకు భయమే లేదు! | - | Sakshi
Sakshi News home page

ఎస్టీ కమిషన్‌ అంటే అధికారులకు భయమే లేదు!

Oct 7 2026 1:40 AM | Updated on Oct 7 2026 1:40 AM

● అధికారుల గైర్హాజర్‌పై కమిషన్‌ మెంబర్‌ ఆగ్రహం

● అధికారుల గైర్హాజర్‌పై కమిషన్‌ మెంబర్‌ ఆగ్రహం

శ్రీశైలంప్రాజెక్ట్‌: రాష్ట్ర షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌ అంటే శ్రీశైలం ఐటీడీఏ అధికారులకు భయమే లేదని ఆ కమిషన్‌ మెంబర్‌ పి.వెంకటప్ప అన్నారు. మంగళవారం ఆయన శ్రీశైలం ఐటీడీఏను సందర్శించారు. తొలుత సున్నిపెంటలోని గిరిజన సంక్షేమ పాఠ శాల, కళాశాల, బాలికల ఆశ్రమ పాఠశాల, ప్రతిభా పాఠశాల, కళాశాలలను సందర్శించారు. గిరిజన విద్యార్థులు, ప్రిన్సిపాల్‌ను అడిగి మౌలిక వసతులు తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి వివిధ శాఖలకు చెందిన అధికారుల్లో కొందరు గైర్హాజరయ్యారు. దీంతో కమిషన్‌ మెంబర్‌ వెంకటప్ప పీఓ పీవీఎస్‌ నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ అంశాలపై చర్చించాల్సిన కమిషన్‌ సమావేశానికి హాజరు కాని అధికారులకు నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం10 మంది గిరిజన రైతులకు మోటార్లు, స్ప్రేయర్లు, ఉద్యానవన పంటల పనిముట్లు అందజేశారు. కార్యక్రమంలో అడ్వయిజరీ కమిటీ సభ్యులు రావుల కొండలు, వెంకటపతి, జీసీసీ డైరెక్టర్‌ జీవులా నాయక్‌, ఎస్‌ఎల్‌పీసీ సభ్యులు బి.మంతన్న, ఎం. నారాయణమ్మ, ఎం.బయన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement