ఆటో ఖర్చు వృథా | - | Sakshi
Sakshi News home page

ఆటో ఖర్చు వృథా

Oct 7 2026 1:40 AM | Updated on Oct 7 2026 1:40 AM

ఆటో ఖర్చు వృథా కడుపునిండా తినడం కష్టమే ప్రజలు ఎక్కువగా రావడం లేదు

సన్నబియ్యం తక్కువ ధరకు ఇస్తున్నారంటే ఆశతో నాతో పాటు మరో ముగ్గురం ఆటో తీసుకుని ఆళ్లగడ్డకు పోయాం. అక్కడ ఎంత సేపు కూర్చున్న బీగం తీయలేదు. అక్కడే ఉన్నవారిని అడిగితే బియ్యం కేంద్రం మూతేసి చాలా రోజులైందని చెప్పడంతో ఉసూరుమంటు వచ్చాం, రానుపోను ఆటోకు అనవసరంగా ఖర్చు వృథా అయ్యింది. – రత్నమ్మ, గోవిందిన్నె

మూడు, నాలుగు నెలల నుంచి బియ్యం ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. తక్కువ ధరకు బియ్యం ఇస్తామని చెప్పారు. ఎక్కడ ఇస్తున్నారో తెలి యడం లేదు. ఇలా అయితే కడుపునిండా తిన డం కూడా కష్టమే. అధికారులు రేషన్‌ దుకాణాల్లోనే సన్నబియ్యం పంపిణీ చేయాలి.

– సువర్ణ, క్రిష్టిపాడు

మార్కెట్‌లో ధరలు నియంత్రించేందుకే సన్నబియ్యం తక్కువ ధరకు విక్రయించే కేంద్రాలు ఏర్పాటు చేశాం. రోజు రిజల్ట్‌ బాగానే ఉంది. మిల్లర్లు నష్టపోయి అందిస్తున్నారు. ఎక్కువ శాతం మంది ఏడాది పొడువునా అవసరమ య్యే మేరకు వడ్లు కొని పెట్టుకుంటారని తెలిసింది. అందుకే కేంద్రాలకు ప్రజలు పెద్దగా రావడం లేదని తెలుస్తోంది. జిల్లాలో అన్ని కేంద్రాలు తెరించేందుకు చర్యలు తీసుకుంటాం.

– రవిబాబు,జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement