● శ్రీమఠంలో త్వరలో ప్రత్యేక కౌంటర్లు
మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో భక్తులు భారీ క్యూలో ఉండకుండా పరిమళ ప్రసా దం అందుకునే వెసులబాటు త్వరలో రానుంది. ఇందుకోసం పరిమళ ప్రసాదం బృహత్తర ప్రాజెక్టు ప్లాన్, అధునాతన మిషనరీలపై బెంగళూరు ఇంజినీర్లతో సోమవారం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు చర్చించారు. ఈ సందర్భంగా పీఠాధి పతి మట్లాడుతూ.. భవిష్యత్తులో శ్రీమఠంకు వచ్చి న భక్తులకు పరిమళ ప్రసాదం విషయంలో ఇబ్బందులు ఉండబోవన్నారు. ప్రతి ఒక్కరికీ అందే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రద్దీ లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పీఠాధిపతి తెలిపారు. కార్యక్రమంలో శ్రీమఠం ఇంజనీర్ సురేష్‌కోనాపూర్, ధార్మిక అధికారి శ్రీపతి, పరిమళ ప్రసాదం సిబ్బంది పాల్గొన్నారు.


