పుర పోరుకు సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

పుర పోరుకు సన్నాహాలు

Oct 4 2026 9:31 AM | Updated on Oct 4 2026 9:31 AM

● జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రకటన ● త్వరలో రిజర్వేషన్ల ఖరారు ● ఇక ప్రత్యక్ష పద్ధతిలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక

జిల్లాలో మున్సిపాలిటీల వారీగా వివరాలు

కేంద్రాలు వార్డుల సంఖ్య

● జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రకటన ● త్వరలో రిజర్వేషన్ల ఖరారు ● ఇక ప్రత్యక్ష పద్ధతిలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక

నంద్యాల(అర్బన్‌): జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. నంద్యాల, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, డోన్‌, మున్సిపాలిటీలతో పాటు బేతంచెర్ల నగర పంచాయతీల్లో అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాను ప్రకటించడంతో పాటు ఇంటింటి సర్వే పూర్తి చేశారు. ఓటర్ల జాబితాకు సంబంధించి గత నెల 29, 30 తేదీల్లో క్‌లైయిమ్‌లు, అభ్యంతరాలను వార్డుల వారీగా క్రమబద్ధీకరించి, ఓటర్ల జాబితాను అప్‌డేట్‌ చేశారు. అక్టోబర్‌ 1న జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికల వార్డులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్లు తుది ఎలక్టోరల్‌ జాబితాను ఫారం–6లో, బీసీ, ఓటర్ల తుది ఎలక్టోరల్‌ జాబితాను ఫారం–6లో ఆయా మున్సిపల్‌ కార్యాలయాలు, ఆర్‌డీఓ, తహసీల్దార్‌ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రజల పరిశీలనార్థం ఉంచారు. అయితే అమరావతిలో మున్సిపాలిటీలా రిజర్వేషన్లు ఖరారు కానుండగా, వార్డుల రిజర్వేషన్‌ను కలెక్టరేట్‌లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియపై నరస్వత్రా ఉత్కంఠ నెలకొంది. పెరిగిన వార్డుల ప్రక్రియలో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీలు వార్డుల వారీగా గెలుపు గుర్రాల అన్వేషణలో తులమునకలై ఉన్నారు. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు స్థానిక ఎన్నికలకు సంబంధించి ముఖ్య నేతలు, అనుబంధ కమిటీల నాయకులు ఔత్సాహికుల తో సమావేశాలు సమీక్షలు జోరుగా నిర్వహిస్తున్నారు.

ప్రత్యక్ష పద్ధతిలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక...

2005 నుంచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక పరోక్ష పద్ధతిలో కొనసాగుతూ వస్తుంది. మెజార్టీ కౌన్సిలర్లు అందరూ కలిసి చైర్మన్‌ను ఎన్నుకునే విధానం అమలులో ఉండేది. ఈ సారి మున్సిపల్‌ ఎన్నికల్లో చైర్మన్‌ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరగనుంది. వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థులతో పాటు చైర్మన్‌ అభ్యర్థులు కూడా నేరుగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికై న చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం విషయంలో వెసులుబాటు ఉండకపోవడంతో మున్సిపాలిటీలో స్థిరమైన పాలనకు అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

కౌన్సిలర్‌ అభ్యర్థులకు కష్టాలు..

మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు కొత్త సవాల్‌ ఎదురవుతున్నారు. వార్డుల పునర్విభజన ఇందుకు ప్రధాన కారణంగా మారింది. ఏ వార్డు ఏ ప్రాంతంలో ఉందో, ఆయా ఓటర్లు ఎక్కడ నివసిస్తున్నారో గుర్తించి వారి ఇళ్లకు వెళ్లి ప్రచారం నిర్వహించడం అభ్యర్థులకు కత్తిమీద సాములా మారనుంది.

మున్సిపాలిటీ ఓటర్లు పోలింగ్‌ పెరిగిన

నంద్యాల 1,99,238 217 42-52

ఆళ్లగడ్డ 35,452 64 27-32

నందికొట్కూరు 36,332 53 29-32

ఆత్మకూరు 35,705 49 24-32

డోన్‌ 52,176 78 32-36

బేతంచెర్ల 31,285 56 20-28

మహిళలే మహరాణులు..

నంద్యాల జిల్లాలోని నంద్యాల, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, డోన్‌ మున్సిపాలిటీలతో పాటు బేతంచెర్త నగర పంచాయతీలో కూడా మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఆరు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 3,09,188 మంది ఓటర్లు ఉండడా అందులో 2,01,597 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 1,88,416 మంది మాత్రమే ఉన్నారు. మొత్తం 5 మున్సిపాలిటీలు, ఓ నగర పంచాయతీలో కూడా మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం.

కీలకం కానున్న రిజర్వేషన్లు...

మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య పెరగడంతో భౌగోళిక స్వరూపాలు, హద్దులు మారాయి. పునర్విభిజనతో రిజర్వేషన్లు కూడా మారనున్నారు. జనాభా ప్రాతిపతికన చైర్మన్‌ పదవితో పాటు వార్డుల్లో కూడా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. వార్డుల సంఖ్య పెరగడంతో వివిధ పార్టీల ఆశావాహులు పురపోరులో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు దక్కించుకునేందుకు ఆశావాహులు అధిష్టానాల చుట్టూ ప్రదిక్షణ చేస్తున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఎన్నికల వాతావరణం వేడెక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement