● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(న్యూటౌన్): అనాథ పిల్లలకు ఆధార్‌కార్డులు ఇవ్వాలని, ఈ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. చెంచు గూడేల్లో పెండింగ్‌లో ఉన్న ఆధార్ నమోదును వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 52 వేల ఎంబీయూలను దశలవారీగా పూర్తిచేయాలన్నారు. నకిలీ ఆధార్ కార్డుల తయారీ, తప్పుడు ధవపత్రాల ఆధారంగా ఆధార్ పొందే ప్రయత్నాలను కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న అపార్ ఐడీ నమోదులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఖాదర్ బాషా, యూఐడీఐ రీజినల్ మేనేజర్ జావీద్, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ అధికారి లలితాబాయి, ఐసీడీఎస్ పీడీ లీలావతిదేవి, ఎల్‌డీఎం అయ్యపురెడ్డి, డీఎంహెచ్‌ఓ శారదాబాయి, డీఎల్‌డీఓ శివారెడ్డి, జీఎస్‌డబ్ల్యూఎస్ కోఆర్డినేటర్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.


