ఆస్పరి: మండలంలోని శంకరబండ గ్రామానికి చెందిన రైతు అనిల్ కుమార్ శుక్రవారం పత్తి పైరును కూలీలతో పీకేయించారు. వర్షాభావ పరిస్థితులతో పత్తి పైరులో ఎదుగుదల లేక రెండు రోజుల నుంచి పీకేస్తునట్లు చెప్పారు. తనకున్న నాలుగు ఎకరాల్లో రూ 1.20లక్షల పెట్టుబడితో పత్తి సాగు చేశానన్నారు. విత్తనం వేసినప్పటి నుంచి వర్షాలు లేకపోవడంతో పైరులో ఎదుగుదల లోపించిందన్నారు. నాలుగు ఎకరాల్లో పత్తి కోత కోస్తే కేవలం 30కేజీల దిగుబడి మాత్రమే వచ్చిందన్నారు. తెచ్చుకున్న అప్పులు ఎలా తీర్చాలోనని ఆవేదన వ్యక్తం చేశారు.


