హంద్రీ–నీవా కాలువలో పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

హంద్రీ–నీవా కాలువలో పడి వ్యక్తి మృతి

Oct 2 2026 5:20 AM | Updated on Oct 2 2026 5:20 AM

మద్దికెర: హంద్రీ–నీవా కాలువలో పడి కొంగనపల్లి ఓబులేసు (51) అనే దివ్యాంగుడు మృతి చెందాడు. ఈ ఘటన ఎడవలి గ్రామంలో సమీపంలో చోటుచేసుకుంది. పొలానికి వెళ్లి వస్తూ కాళ్లు కడుక్కుందామని బుధవారం హంద్రీ–నీవా కాలువ వద్దకు ఓబులేసు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడ్డాడు. ఈత రాకపోవడంతో కొట్టుకుపోయాడు. ఇంటికి రాకపోవడంతో బంధువులు ఫోన్‌ చేసినా సమాచారం లేదు. గురువారం అనంతపురం జిల్లా రాగులపాడు వద్ద ఓబులేసు మృతదేహం కనిపించింది. మృతునికి భార్య గౌరమ్మ, ఒక కుమార్తె ఉన్నారు.

ఆలూరులో భారీ అగ్ని ప్రమాదం

● రూ.3 కోట్లకు పైగా ఆస్తి నష్టం

ఆలూరు రూరల్‌: అలూరు పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రూ.3 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. బాఽధితుడు కిషోర్‌, అగ్నిమాపక శాఖ అధికారి శివయ్య తెలిపిన వివరాల మేరకు.. ఆలూరు తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలోని దుస్తుల దుకాణంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. మంటల తీవ్రతకు దుకాణంలోని వస్త్రాలు, సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అర్ధరాత్రి చెలరేగిన మంటలు గురువారం మ ధ్యాహ్నం 2 గంటలకు అదుపులో వచ్చాయి. ప్రాణనష్టం తప్పడంతో స్థానికు లు ఊపిరి పీల్చుకున్నారు. దసరా పండుగ ఉండడంతో కొత్త దుస్తులు తెప్పించానని అగ్ని ప్రమాదం సంభవించి మూడు కోట్ల నష్టం వా టిల్లిందని యజమాని కిషోర్‌ కన్నీరుమున్నీరయ్యారు.

విద్యార్థులకు ‘సేవా సంకల్ప్‌’ పోటీలు

కర్నూలు సిటీ: సేవా సంకల్ప్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు డ్రాయింగ్‌, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కర్నూలు బీక్యాంపులోని ప్రభుత్వ ఉన్నత విద్య అధ్యయన సంస్థ(ఐఏఎస్‌ఈ)లో నిర్వహించిన ఈ పోటీల్లో మండల స్థాయిలో ప్రతిభకబరిచిన 284 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను విజేతలుగా ప్రకటించారు. విజేతలు ఈ నెల 3వ తేదీలోపు రాష్ట్ర స్థాయికి పంపనున్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 9న అమరావతిలో జరుగనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ కో–ఆర్డినేటర్‌ రంగమ్మ, సమగ్ర శిక్ష ఏఎంఓ రఫీక్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement