పత్తికొండలో బైక్‌ అదుపుతప్పి మహిళ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

పత్తికొండలో బైక్‌ అదుపుతప్పి మహిళ దుర్మరణం

Oct 2 2026 5:20 AM | Updated on Oct 2 2026 5:20 AM

● వామపక్ష సంఘాల అధ్వర్యంలో

మృతదేహంతో ధర్నా

పత్తికొండ: ఇరుకు రోడ్డులో బైక్‌ అదుపుతప్పి అర్టీసీ బస్సు కింద పడి ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటన పత్తికొండలో గురువారం చోటు చేసుకుంది. సరుకులు కోనుగోలు కోసం మద్దికెర మండలం బురుజుల గ్రామానికి సత్యవతి(55) అనే మహిళ భర్త మహేశ్వరనాయుడుతో కలసి పత్తికొండకు వచ్చారు. సంత చేసుకున్న అనంతరం బైక్‌ మీద భార్యాభర్తలు ఊరికి వెళ్తున్న సమయంలో బైక్‌ అదుపుతప్పింది. అర్టీసీ బస్డాండ్‌ దగ్గర డోన్‌ డిపోకు చెందిన అర్టీసీ బస్సు కింద పడటంతో సత్యవతి అక్కడికక్కడే మృతి చెందారు. ఇరుకు రహదారి వల్లే ప్రమాదం అంటూ ప్రజల అగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీపీఎం, సీపీఐ నాయకులు అక్కడికి వచ్చి మృతదేహంతో ధర్నా చేశారు. రహదారి విస్తరణ పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్న పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ధర్నా చేస్తున్నా అధికారులు, టీడీపీ నాయకులు అక్కడికి రాలేదు. ప్రజల ప్రాణాలు పోతున్నా కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ప్రజలు అగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ప్రతిరోజూ అందోళనలు నిర్వహిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. అధికారులు, టీడీపీ నాయకులు స్పందించకపోవడంతో వామపక్ష పార్టీలు నాయకులు ధర్నా విరమించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జయన్న తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement