● ఎకై ్సజ్ జాయింట్ కమిషనర్ నాగలక్ష్మి
బొమ్మలసత్రం: జిల్లాలో 27 మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు పొందేందుకు ఇంట్లో నుంచే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసే ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నూతనంగా ప్రవేశపెట్టారని ఎకై ్సజ్ శాఖ జాయింట్ కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. నంద్యాల ఎకై ్సజ్ పోలీస్టేషన్‌లో బుధవారం అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 113 మద్యం దుకాణాలు ఉండగా వాటిలో 89 దుకాణాల లెసెన్స్‌లను పాతవారికే కేటాయించామన్నారు. మిగతా వాటికి లైసెన్స్‌ల పునరుద్ధరణ ప్రక్రియకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నామన్నారు. దరఖాస్తులు అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకూ స్వీకరిస్తామని, ఆసక్తి ఉన్న వారు రూ. 3 లక్షలు నాన్‌రీఫండబుల్ నగదును చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో నవోదయం కార్యక్రమం విజయవంతంగా నడిపి సారాను నిర్మూలించడంతో దుకాణాదారులకు ఆదాయం పెరిగిందన్నారు. నంద్యాలలో జనాభా అధికంగా ఉండి దుకాణాలు తక్కువగా ఉండటంతో లైసెన్స్‌దారులకు ఆదాయం అధికంగా ఉందన్నారు. సమావేశంలో కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, జిల్లా ఎకై ్సజ్ అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేడే తుదిగడువు
ఆత్మకూరు: మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 1వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ జాయింట్ కమిషనర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం ఆత్మకూరు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ అధికారి ఇ.మోహన్‌రెడ్డి అధ్యక్షతన స్థానిక ఎకై ్సజ్ స్టేషన్‌లో సమావేశం నిర్వహించారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిర్భయంగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.


