ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు వలంటర్లకు అరచేతిలో స్వర్గం చూపించారు. రూ. 5 వేలు కాదు అధికారంలోకి వస్తే రూ. 10 వేలు ఇస్తానని మాయమాటలు చెప్పారు. జీతం ఏమో గాని ఉన్న బాధ్యత పోయింది. గత ప్రభుత్వంలో మేం ప్రభుత్వ పథకాలను ప్రజల ఇళ్ల వద్దకు తీసుకపోయాం. వారికి అన్ని విధాలుగా సహాయ పడ్డాం. కరోనా సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి అధికారులకు, ప్రజలకు తోడుగా ఉన్నాం. ఇప్పుడు బాబు కొత్తగా ప్రజాధనంతో ప్రచారకర్తలకు ప్రోత్సాహం ఇస్తానని ప్రకటించారు. అది ప్రజాధనం దుర్వినియోగం కాదా? – ఉపేంద్ర, మాజీ వలంటీర్,
గుంప్రమాన్‌దిన్నె, శిరివెళ్ల మండలం


