పసిబాలుడి మృతదేహంతో ధర్నా | - | Sakshi
Sakshi News home page

పసిబాలుడి మృతదేహంతో ధర్నా

Oct 1 2026 4:40 AM | Updated on Oct 1 2026 4:40 AM

● పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంతో డెంగ్యూ సోకి మృతి చెందాడని ఆగ్రహం

● పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంతో డెంగ్యూ సోకి మృతి చెందాడని ఆగ్రహం

దేవనకొండ: గత వారం రోజులుగా డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ బుధవారం 19 నెలల చిన్నారి రేవంత్‌నాయుడు మృతిచెందాడు. బాలుడి మృతదేహంతో తండ్రి నరసనాయుడు, బంధువులు దేవనకొండ ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేపట్టారు. పారిశుద్ధ్యం లోపించడం, విచ్చలవిడిగా పందుల సంచారంపై గత రెండు నెలలుగా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. పరిసరాలను శుభ్రం చేయకపోవడం, పందుల బెడదను అరికట్టకపోవడం వల్ల పిల్లలు, పెద్దలు విషజ్వరాల బారిన పడుతున్నారని, తమ కుమారుడు డెంగ్యూ బారిన పడి మరణించాడని బాలుడి తండ్రి నరసనాయుడు, బంధువులు ఆరోపించారు. తాము ఫిర్యాదు చేసినప్పుడు స్పందించి పరిసరాలను శుభ్రంగా ఉంచి ఉంటే తమ కుమారుడు బతికేవాడని అన్నారు. దాదాపు రెండు గంటల పాటు ధర్నా చేయడంతో ఎంపీడీఓ జ్యోతి, ఈఓఆర్‌డీ గోపాల్‌ బాధితులకు సర్ధి చెప్పి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పడంతో బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లి ఖననం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement