తాటాకు చప్పుళ్లకు భయపడం | - | Sakshi
Sakshi News home page

తాటాకు చప్పుళ్లకు భయపడం

Sep 29 2026 12:51 AM | Updated on Sep 29 2026 12:51 AM

● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్‌రెడ్డి

ఆళ్లగడ్డ: అధికారం ఉంది కదా అని పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు పెడతామని బెదిరించే తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడే వారు లేరని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే అఖిలప్రియపై సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు సోమవారం భూమా కిషోర్‌రెడ్డిని స్టేషన్‌కు పిలిపించి నోటీసులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అఖిలప్రియ, వారి అనుచరులు చేస్తున్న దందాలను నిత్యం బయటపెడుతున్నందుకే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారని మండిపడ్డారు. తన కోళ్ల ఫారంలో పని చేసే ఓ వ్యక్తిని బెదిరించి, కొట్టామని, కులం పేరుతో ధూషించామని తప్పుడు ప్రచారం చేయడంతో జరిగిన వాస్తవాలను ఎమ్మెల్యే అఖిలప్రియకు తెలిసేలా సోషల్‌ మీడియాలో పోస్టు చేశామన్నారు. ఈ నోటీసులు కక్ష సాధింపు చర్యలుగా కనిపిస్తున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement