వైభవంగా అహోబిలేశుడి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా అహోబిలేశుడి కల్యాణం

Sep 28 2026 7:21 AM | Updated on Sep 28 2026 7:21 AM

ఆళ్లగడ్డ: అహోబిలంలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్ల మొక్కుబడి కల్యాణోత్సవం కనులపండువగా సాగింది. భక్తులు సమర్పించుకున్న మొక్కుబడి సేవలో భాగంగా ఆదివారం దిగువ అహోబిలంలో స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉద యం స్వామి అమ్మవార్లను సుప్రభాతసేవతో మేల్కొలిపి దివ్యదర్శనం అనంతరం నిత్యపూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తు లు భూనీలా సమేత శ్రీ ప్రహ్లాదవరదుడిని యాగశాలలో కొలువుంచి అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించి, పట్టు పీతాంబరాలతో అలంకరించి కొలువుంచారు. శ్రీ సుదర్శన హోమం నిర్వహించారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్స వం వైభవంగా నిర్వహించారు. అనంతరం ముత్యాల తలంబ్రాల కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలు ప్రధానార్చకులు కీడాంబి వేణుగోపాలన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement