అహోబిలంలో పౌర్ణమి పూజలు | - | Sakshi
Sakshi News home page

అహోబిలంలో పౌర్ణమి పూజలు

Sep 27 2026 1:28 AM | Updated on Sep 27 2026 1:28 AM

ఆళ్లగడ్డ: అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం విశేష పూజలు నిర్వహించారు. ఉద యం మూలమూర్తులకు నిత్యపూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ఆలయం ముఖద్వారం మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకించి ధూపదీపాలతో మహామంగళహారతి ఇచ్చి నైవేద్యం నివేదించారు. రాత్రి విశేషాలంకరణలో స్వామి ఉభయ దేవేరులతో కొలువుదీరి మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు కను విందు చేశారు.

ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత పెంచాలి

బనగానపల్లె రూరల్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యా శాఖాధికారి(డీఐఈవో) శంకర్‌నాయక్‌ అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యప్రపూర్ణ అధ్యక్షతన ఏపీ మోడల్‌ స్కూల్‌, కేజీబీవీ విద్యాలయాల అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారిన సిలబస్‌కు అనుగుణంగా విద్యార్థులకు విద్యా బోధ న చేయాలన్నారు. విద్యార్థులను నిరంతరం పర్యవేక్షస్తూ వారిని ఐఐటీ, నీట్‌, ఎంసెట్‌ వంటి పరీక్షలకు అవసరమైన మార్గదర్శకాలు విద్యార్థులకు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు కృష్టుడు, నాగేశ్వరరెడ్డి, కిశోర్‌, ఆనంద్‌, రామయ్య,శ్రీలత కేజీబీవీ ప్రిన్సిపాల్‌ సునీత,మోడల్‌ స్కూల్‌ అధ్యాకులు చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ

నంద్యాల(న్యూటౌన్‌): ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ అక్టోబర్‌ 1వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుందని డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకులు 30వ తేదీ వరకు సమ్మెలో ఉన్న కారణంగా పింఛన్‌ మొత్తాన్ని అక్టోబర్‌ 1వ తేదీన ఉదయం బ్యాంక్‌ల నుంచి విత్‌డ్రా చేసి పంపిణీ అధికారులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని జిల్లాలోని పింఛన్‌ లబ్ధిదారులందరూ గుర్తించాలన్నారు.

వైభవంగా శ్రీశైలగిరి ప్రదక్షిణ

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల క్షేత్రంలో పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం సాయంత్రం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సాయంత్రం స్వామిఅమ్మవార్ల మహా మంగళహారతుల అనంతరం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం నుంచి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మ గుడి, నందిమండపం, గంగాసదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, రింగ్‌రోడ్డు, ఫిల్టర్‌బెడ్‌, సిద్దరామప్ప కొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి నందిమండపం, ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన అధికారులు, సిబ్బంది, పలువురు భక్తులు పాల్గొన్నారు.

నిరసనలకు ఉద్యోగులు దూరంగా ఉండాలి

బొమ్మలసత్రం: అనుమతి లేని ధర్నాలు, నిరసనలు, ఆందోళనల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనరాదని, నిబంధనలు ఉల్లంఘించే కార్యక్రమాల్లో పాల్గొనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సునీల్‌ షోరాణ్‌ హెచ్చరించారు. స్థానిక కార్యాలయంలో శనివారం ఎస్పీ మాట్లాడుతూ.. విజయవాడలో స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతున్న ధర్నా, నిరసన కార్యక్రమానికి అనుమతి లేదన్నారు. అనధికారిక ఆందోళనలపై పోలీసులు నిఘా ఉంచడంతో పాటు అవసరమైతే సీసీ కెమెరాలు డ్రోన్‌ల ద్వారా పాల్గొనే వారిని గుర్తిస్తామన్నారు. ఉద్యోగులుగా విధులకు హాజరవుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement