సంఘ సంస్కర్త గురజాడ | - | Sakshi
Sakshi News home page

సంఘ సంస్కర్త గురజాడ

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

● జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల(న్యూటౌన్‌): తన రచనలతో సంఘంలో గొప్ప మార్పు తెచ్చిన సంస్కర్త మహాకవి గురజాడ వెంకట అప్పారావు అని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గురజాడ రచనలు భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. విజయనగరం జిల్లాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. అక్కడ గురజాడ 150వ జయంతి వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించే అవకాశం తనకు లభించిందన్నారు. గురజాడపై సేకరించిన సమాచారంతో కవులు, రచయితల వ్యాసాలతో పుస్తకాలను రూపొందించి గ్రంథాలయాలకు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజాసేవే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌, డీఆర్‌ఓ రామునాయక్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement