శ్రీశైలం డ్యాంలో
నీటి తగ్గుదల ఇలా...
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీటిసరఫరా పూర్తిగా తగ్గింది. కేవలం 4,167 క్యూసెక్కులు ఎస్సారెమ్సీలోకి వదులుతున్నారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి కేసీ ఎస్కేప్ కాల్వకు వెయ్యి క్యూసెక్కులు, జీఎన్‌ఎస్‌ఎస్ కాల్వకు 3 వేల క్యూసెక్కుల చొప్పున సరఫరా చేస్తున్నారు. నీటి విడుదల తగ్గడంతో రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం డ్యాంలో సోమవారం ఉదయం 858 అడుగుల నీటి మట్టం, 99.9810 టీఎంసీల నీరు నిల్వ ఉంది. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం డ్యాంలోని నీటిని ఎడాపెడా వినియోగిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటంతో డ్యాంలో రోజుకు రెండు టీఎంసీల మేర నీటిమట్టం తగ్గుతూ వస్తోంది. ఈ లెక్కన నిత్యం నీటిమట్టం తగ్గుతూ వస్తుండటంతో మరో వారం రోజుల్లో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా నీటిసరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా ఇప్పటిదాకా 30 టీఎంసీల నీటిని మాత్రమే దిగువ ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు.
తేదీ నీటిమట్టం నీటి నిల్వ
(అడుగుల్లో..) (టీఎంసీల్లో)
ఈనెల 19 859.90 104.1450
20వ తేదీ 858.70 101.9210
21వతేదీ 858 99.9810


