బొమ్మలసత్రం: ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సత్తాచాటిన నంద్యాల జిల్లా పోలీసులను సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సునిల్ షొరాన్ అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నాగార్జున యూనివర్సిటీలో ఈనెల 1 నుంచి 4వ తేదీ వరకు పోటీలు నిర్వహించగా జిల్లా పోలీసులు ఏడు బంగారు, పది వెండి, 13 కాంస్య పతకాలు సాధించడం సంతోషమన్నారు. పోలీసు మహిళా విభాగంలో మార్షల్ ఆర్ట్స్, రెజ్లింగ్, ఆర్మ్ రెజ్లింగ్ తదితర క్రీడల్లో ఓవరాల్ చాంపియన్‌షిప్‌లో మొదటి స్థానంలో జిల్లా మహిళా పోలీసులు నిలవడం అభినందనీయమన్నారు. అలాగే పురుషులు రెండో స్థానంలో నిలవడం హర్షించదగ్గ విషయమన్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీ ఖాదర్‌బాషా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ చిన్నికృష్ణ, డీఎస్పీలు, శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


