అరాచక శక్తులకు అధికార పార్టీ నేతల అండ | - | Sakshi
Sakshi News home page

అరాచక శక్తులకు అధికార పార్టీ నేతల అండ

Aug 4 2026 1:35 AM | Updated on Aug 4 2026 1:35 AM

డోన్‌: ఎంతో ప్రశాంతంగా డోన్‌ పట్టణంలో అరాచక శక్తులు గ్యాంగ్‌ల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. అధికార పార్టీ అండదండటంతో ఎరుకలి పవన్‌ అనే యువకుడు రౌడీషీటర్‌ తరహాలో బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. ఎలాంటి కేసు అయినా తాను తప్పిస్తానని యువతను పెడదోవ పట్టించి తన వెంట తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం పట్టణంలో తారకరామనగర్‌లో ఇద్దరు యువకులు తన మాట వినలేదని చితకబాదాడు. టీడీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఫొటో పచ్చబొట్టును చేతిపై వేయించుకుని తనకు అధికార పార్టీనేతలతో పరిచయాలు ఉన్నాయంటూ అధికారులు, పోలీసులను సైతం బెదిరిస్తున్నట్లు సమాచారం. చివరకు పోలీసు యంత్రాంగాన్ని బదిలీల పేరుతో బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఎరుకలి పవన్‌ అనుచరుల ఆగడాల వీడియో లు హల్‌చల్‌ కావడంతో అతని గ్యాంగ్‌పై పోలీసులు సోమవారం కొరడా జులిపించారు. చాలా మందిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో గుణపాఠం నేర్పి పట్టణ వీధుల్లో పరేడ్‌ చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement