టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలోకి | - | Sakshi
Sakshi News home page

టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలోకి

Apr 15 2026 8:56 AM | Updated on Apr 15 2026 8:56 AM

గడివేముల: మండల పరిధిలోని ఒండుట్ల గ్రామానికి చెందిన ఐదు కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరాయి. వీరికి వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌ రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకుడు గంజర్ల రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కాటసాని ఇంటి వద్దకు చేరుకుని పార్టీలో చేరారు. పార్టీలో చేరినవారిలో సత్యనారాయణ, మద్దిలేటి, గోరంట్ల, మారెళ్ల కిట్టు, నాగేష్‌ తదితర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంత వరకు అమలు చేయలేదన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందన్నారు. పార్టీలో చేరిన వారి భవిష్యత్తులో సముచిత న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కాలు నాయక్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు అనిల్‌ కుమార్‌ రెడ్డి, గని రామలింగేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement