సమస్యలపై ఉపాధ్యాయుల నిరసన గళం | - | Sakshi
Sakshi News home page

సమస్యలపై ఉపాధ్యాయుల నిరసన గళం

Apr 10 2026 10:21 AM | Updated on Apr 10 2026 10:21 AM

మూల్యాంకన కేంద్రం ఎదుట ఆందోళన

నంద్యాల(న్యూటౌన్‌): ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేంత వరకు పోరడతామని నంద్యాల జిల్లా ఫ్యాప్టో చైర్మన్‌ శివయ్య, జనరల్‌ సెక్రటరీలు దస్తగిరిబాషా, వరప్రసాద్‌, కార్యవర్గ సభ్యుడు నగరి శ్రీనివాసులు తెలిపారు. నంద్యాల పట్టణ సమీపంలో ఉన్న ఎస్‌డీఆర్‌ పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి మూల్యాంకన కేంద్రం ఎదుట గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే 30 శాతం ఐఆర్‌ ప్రకటన ఇవ్వాలన్నారు. దీర్ఘకాలిక బకాయిల చెల్లించడంతోపాటు నాలుగు పెండింగ్‌ డీఏల మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని కోరారు. ఏకీకృత రూల్స్‌ సమస్యల పరిష్కరించాలన్నారు. బోధనేతర కార్యక్రమాల రద్దు చేయాలన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు గ్రాట్యుటీ కమ్యూటేషన్‌, లీవ్‌ఎన్వెస్‌మెంట్‌ ఆలస్యం లేకుండా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎంఈఓల బదిలీలు, ఎంఈఓ, హెచ్‌ఎంల పరస్పర బదిలీలు చేపట్టాలన్నారు. కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌, గురుకులాలు, ఎయిడెడ్‌, యాజమాన్యాల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం ఆగబోదని వెల్లడించారు. ప్రతి పాఠశాలలో నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ను నియమించాలని కోరారు. నాయకులు రవికుమార్‌, స్వామిశంకర్‌, సుబ్బన్న, లక్ష్మణ్‌నాయక్‌, అజాంబేగ్‌, వరప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement