వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం | - | Sakshi
Sakshi News home page

వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం

Apr 9 2026 7:23 AM | Updated on Apr 9 2026 7:23 AM

సాక్షి, నంద్యాల: వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఉమ్మడి జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి లీలా వెంకటేష్‌ శేషాద్రి తెలిపారు. నంద్యాలలోని స్పెషల్‌ సబ్‌ జైలును బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సబ్‌ జైల్లో గదులను, వంటశాలను, పరిసరాలను పరిశీలించారు. ఖైదీల ఆరోగ్య విషయాలను, కేసుల విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. న్యాయ విజ్ఞాన సదస్సుపై ఖైదీలకు అవగాహన కల్పించారు. జడ్జి వెంట జైలు సూపరింటెండెంట్‌ గురుప్రసాద్‌ రెడ్డి, సిబ్బంది రామచంద్రారెడ్డి ఉన్నారు.

ఎస్సార్బీసీకి నీటి విడుదల బంద్‌

బనగానపల్లె: ఎస్సార్‌బీసీకి నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయకట్టు పరిధిలో 1.62 లక్షల ఎక రాల ఆయకట్టు ఉంది. బనగానపల్లె నియోజకవర్గంలోని బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల మండలాల్లో 58వేల ఎకరాలు ఉండగా రబీలో 12 వేల ఎకరాల్లొ మొక్కజొన్న, 16వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. మరికొన్ని పంటలను ఇతర విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రస్తుతం వరి వెన్ను, మొక్కజొన్న కంకిదశలో ఉంది. ఈనె ల చివరి వరకు నీటిని విడుదల చేస్తే ఆయకట్టు పరిధిలోని మొత్తం పంటలన్నీ చేతికి వచ్చే అవకాశం ఉంది. గోరుకల్లు రిజర్వాయర్‌లో నీరు ఉన్నప్పటికీ ఎస్బార్‌బీసీకి విడుదల నిలిపివేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం మే చివరి వరకు నీటిని ఇచ్చేవారని, ఇప్పుడు సమస్య ఎందుకు వచ్చిందో అర్థకం కావడం లేదన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని నీటిని విడుదల చేయాలని రైతులు కోరారు.

డీటీలకు తహసీల్దార్లుగా పదోన్నతి

సాక్షి, నంద్యాల: జిల్లాలోని పలు తహసీల్దార్‌ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్‌లను అడ్‌హక్‌ తహసీల్దార్లుగా నియమిస్తూ బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు పది మంది తహసీల్దార్‌లుగా పదోన్నతులు పొందినట్లయ్యింది. ఆళ్లగడ్డ డిప్యూటీ తహసీల్దార్‌ రాజీవ్‌రెడ్డిని బనగానపల్లె తహసీల్దార్‌గా, బనగానపల్లె సీఎస్‌డీటీగా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వర్‌రెడ్డిని అవుకు మండల తహసీల్దార్‌గా నియమించారు. గోస్పాడు డిప్యూటీ తహసీల్దార్‌ హరితను కలెక్టరేట్‌ డీ సెక్షన్‌ కో ఆర్డినేటర్‌గా, బండిఆత్మకూరుగా డిప్యూటీ తహసీల్దార్‌ గురునాదంను కలెక్టరేట్‌ డీసెక్షన్‌ సూపరింటెండెంట్‌గా నియమించారు. డీఎస్‌ఓ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న ఫక్కీర్‌ అహ్మద్‌ను ఆత్మకూరు డీఏఓగా, నేషనల్‌ హైవే డీటీగా విధులు నిర్వహిస్తున్న అనితను కలెక్టరేట్‌ సీ సెక్షన్‌ సూపరింటెండెంట్‌గా నియమించారు. ఎస్‌ఆర్‌బీసీ డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్న శ్రీవాణిని నంద్యాల మండల తహసీల్దార్‌గా, మహానంది డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న రమాదేవిని మహానంది తహసీల్దార్‌గా, వెలుగోడు డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్న చంద్రశేఖర్‌ను సంజామల తహసీల్దార్‌గా, పాణ్యం డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్న శివశంకర్‌ను పాణ్యం తహసీల్దార్‌గా నియమిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement