ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం విఫలం

Mar 26 2026 7:35 AM | Updated on Mar 26 2026 7:35 AM

మౌలిక వసతుల కల్పనలో

నంద్యాల(అర్బన్‌): వైఎస్సార్‌నగర్‌ ఏర్పాటుకు మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి ఎంతో కృషి చేశారని, నేడు చంద్రబాబు ప్రభుత్వం, అధికారులు కాలనీవాసులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో కాలనీ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిస్తే ప్రస్తుత పాలకులు కాంట్రాక్టర్లను బెదిరించి పనులు నిలిపివేయడం దుర్మార్గమన్నారు. గత సోమవారం బుడగజంగాల కాలనీలో మిగులు భోజనం ఆరగించి అస్వస్థతకు గురైన కుటుంబాలను బుధవారం శిల్పారవి పరామర్శించారు. దాదాపు 80 మంది బుడగ జంగాల సామాజిక వర్గాలను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా బాధిత కుటుంబాలు సాధారణ స్థితికి రాకపోవడం ఆందోళనకరమన్నారు. వారికి అవసరమైన వైద్యం, ఆహార పదార్థాలు, తాగునీరు అందించడకుండా పరిసరాల పరిశుభ్రత చేపట్టకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, తక్షణమే సంఘటనపై విచారణ జరిపి వారికి న్యాయం చేయాలన్నారు. బుడగజంగాల కాలనీ వాసులకు ఏదైనా తలెత్తితే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే వెంట వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు దాల్‌మిల్‌ అమీర్‌, 38వ వార్డు ఇన్‌చార్జి రమణ, మాజీ కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు జయప్రకాష్‌రెడ్డి, సోమశేఖర్‌, అంకాలయ్య, రామకృష్ణారెడ్డి, అన్వర్‌బాషా, సాయి, కిరణ్‌, నాయక్‌, బాబు, చిరు, ప్రసాదరెడ్డి, గీతారాణి, వెంకి, వెంకటస్వామిశెట్టి, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్టర్లను బెదిరించి పనులు

నిలిపివేశారు

బాధితులకు మెరుగైన వైద్యం

అందించలేకపోయారు

మాజీ ఎమ్మెల్యే

శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement